బన్నీ మొదలుపెట్టేశాడు!
మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ మాత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయారనే చెప్పాలి.
By: Tupaki Desk | 28 Dec 2024 1:31 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్ గా పుష్ప-2 మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తోంది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ మాత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయారనే చెప్పాలి.
పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్.. ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోజే పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం బెయిల్ పై బయటకు రావడం, తదనంతర పరిణామాల వల్ల బన్నీ ఇబ్బందిపడ్డారు!
దీంతో ముందుగా ప్లాన్ చేసినట్లు.. అల్లు అర్జున్ ప్రమోషన్స్, సక్సెస్ మీట్స్, ఈవెంట్స్ లో పాల్గొనలేకపోయారు. అయితే తాజాగా పుష్ప-2 సినిమా పనుల కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ కు బన్నీ వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా థియేట్రికల్ వెర్షన్ కు కొన్ని సీన్స్ ను మేకర్స్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
సినిమా అవుట్ పుట్ నిడివి ఎక్కువ కావడంతో రిలీజ్ కు ముందుకు కొన్ని సీన్స్ ను కట్ చేశారు మేకర్స్! దీంతో మూవీలో కొన్నిచోట్ల కంటిన్యుటీ మిస్ అయిందనే వార్తలు వచ్చాయి. అది వాస్తవమేనని చెప్పాలి. సినిమాలో జపాన్ కు వెళ్లిన పుష్ప రాజ్ ఇంట్రో ఫైట్ సడెన్ గా ఆగిపోతుంది. దీంతో ఆడియన్స్ మదిలో అనేక ప్రశ్నలు మెదిలాయి.
వాటిన్నింటికీ ఆన్సర్ ఇచ్చే సీన్స్ ఇప్పటికే మేకర్స్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాటిని సినిమాలో కలపడానికి మేకర్స్ సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సీన్స్ కోసం ఇప్పుడు బన్నీ డబ్బింగ్ చెబుతున్నారని సమాచారం. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లినట్లు వినికిడి. దీంతో అన్ని భాషల్లో అల్లు అర్జున్ డబ్బింగ్ ను కంప్లీట్ చేస్తున్నారట.
పని అయ్యాక.. జనవరి 1వ తేదీ నుంచి కొత్త వెర్షన్ అందుబాటులోకి రానుందని సమాచారం. ఓటీటీ వెర్షన్ లో కూడా కొత్త సీన్స్ ఉంటాయని టాక్. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో కొత్త వెర్షన్ వచ్చాక.. మళ్లీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంది. వసూళ్లు కూడా పెరుగుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..