Begin typing your search above and press return to search.

పుష్ప 2 సక్సెస్ మీట్… దేవి కనిపించలేదే..

ఈ సక్సెస్ మీట్ ద్వారానే తన అసిస్టెంట్స్ కి ఎవరైనా నిర్మాతలు కళ్ళకు అడ్డుకొని డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేయొచ్చని సుకుమార్ అన్నారు.

By:  Tupaki Desk   |   8 Dec 2024 4:56 AM GMT
పుష్ప 2 సక్సెస్ మీట్… దేవి కనిపించలేదే..
X

'పుష్ప 2' మూవీ సక్సెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ కి టెక్నీషియన్స్ అందరూ వచ్చారు. సుకుమార్ అందరిని స్టేజ్ పైకి పిలిచి వారి కష్టం గురించి పరిచయం చేశారు. ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ లో ఉండి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి సుకుమార్ థాంక్స్ చెప్పారు. అలాగే ఒక్కొక్కరి టాలెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సక్సెస్ మీట్ ద్వారానే తన అసిస్టెంట్స్ కి ఎవరైనా నిర్మాతలు కళ్ళకు అడ్డుకొని డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేయొచ్చని సుకుమార్ అన్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎక్కడా కనిపించలేదు. నిజానికి అతను వస్తాడని బ్యానర్లు, కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా గొప్పగా ఉందని ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో వివాదం నడుస్తోంది. అందుకే దేవిశ్రీ ప్రసాద్ వచ్చి ఉండడనే మాట వినిపిస్తోంది.

ఈ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వర్క్ గురించి నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్ ప్రశంసించారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ మాట్లాడుతూ ‘పుష్ప 2’కి 90% బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నేను చేసిందే అని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో పుష్ప మ్యూజిక్ క్రెడిట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకరి క్రెడిట్ నేను ఎప్పటికి తీసుకోనని అన్నారు.

అలాగే చెన్నైలో జరిగిన ఈవెంట్ లో కూడా దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతలపై కాస్తా భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో ఎలాంటి వివాదం లేదని నిర్మాతల యలమంచిలి రవి క్లారిటీ ఇచ్చిన కూడా అంతర్గతంగా వ్యవహారం సీరియస్ గానే నడుస్తుందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ క్రెడిట్ అంతా దేవిశ్రీ ప్రసాద్ కి ఇచ్చారు. ఈ మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సామ్ సిఎస్ వర్క్ చేసినట్లు వారే ట్విట్టర్ లో ప్రకటించారు.

అయితే డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాతలు ఎక్కడా దేవిశ్రీ ప్రసాద్ పేరు తప్ప మిగిలిన వారి పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. దేవిశ్రీ ప్రసాద్ పై ప్రశంసలు కురిపిస్తున్న కూడా అతను మాత్రం మేకర్స్ మీద కాస్తా అసహనంగానే ఉన్నాడని అనుకుంటున్నారు. తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో కూడా పాల్గొనకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. మరి ఈ విషయంలో దేవి నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.