Begin typing your search above and press return to search.

మంచు వివాదం.. మనోజ్ బ్రేక్ ఇచ్చాడా?

అయితే, ఈ గొడవల మధ్య మంచు మనోజ్ తన సినీ కెరీర్‌పై తిరిగి దృష్టి పెట్టినట్లు మరో టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   12 Dec 2024 11:11 AM GMT
మంచు వివాదం.. మనోజ్ బ్రేక్ ఇచ్చాడా?
X

మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదాలు ప్రస్తుతం తాత్కాలికంగా ముగిసినట్లు మరో టాక్ వైరల్ గా మారింది. ఇటీవల జరిగిన ఘర్షణల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బయటపడటంతో, ఈ సంఘటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ గొడవల మధ్య మంచు మనోజ్ తన సినీ కెరీర్‌పై తిరిగి దృష్టి పెట్టినట్లు మరో టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

మనోజ్ ప్రస్తుతం తన తాజా చిత్రం భైరవం షూటింగ్‌లో పాల్గొనడం ప్రారంభించారని సోషల్ మీడియాలో కూడా కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే అఫీషియల్ గా ఎవరు కూడా దీనిపై పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇదే సమయంలో, మనోజ్ తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను కూడా పంపించేసినట్లు చెబుతున్నారు. వివాదాలను పక్కన పెట్టి తన సినీ ప్రయాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మనోజ్ షూటింగ్ లో పాల్గొంటే నిజంగా ఈ వివాదం ఓ కొలికీ వచ్చినట్లే అవుతుంది. అయితే నిజంగా మనోజ్ షూటింగ్ కి వెళ్ళారా లేదా అనేది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ఇక మనోజ్ నటిస్తున్న భైరవం సినిమా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోంది. నాంది, ఉగ్రం వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న విజయ్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా, గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ లో వ్యక్తిగత గొడవలు తీవ్రతకు దారితీశాయి. రాచకొండ సీపీ సుధీర్ బాబు ఇద్దరు అన్నదమ్ములను విచారించగా, వారి మధ్య శాంతి భద్రతలను పాడు చేసే చర్యల నుండి దూరంగా ఉండాలని హెచ్చరించారు. లక్ష రూపాయల పర్సనల్ బాండ్ డిపాజిట్ చేసి, పబ్లిక్‌లో ఎలాంటి గొడవలు చేయబోమని హామీ ఇవ్వడం ద్వారా ఈ గొడవలకు తాత్కాలిక ముగింపు లభించినట్లు కనిపిస్తోంది.

ఇకపోతే, మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు ఫామ్‌హౌస్ మేనేజర్ కిరణ్ కుమార్, మరో వ్యక్తి విజయ్ రెడ్డిని పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలు బయటపడటంతో, ఈ గొడవలు ఎంతకాలంగా కొనసాగుతున్నాయనే వివరాలు కూడా ఇప్పుడు బహిరంగంగా చర్చకు వస్తున్నాయి. ఈ గొడవల అనంతరం మంచు ఫ్యామిలీలో మళ్ళీ ఐక్యత సాధ్యమవుతుందా లేదా అన్నది ఇప్పట్లో చెప్పడం కష్టమే. అయితే, మనోజ్‌ తాను సినీ కెరీర్‌పై దృష్టి పెట్టాలని చూస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ తరహాలో సపోర్టింగ్ రోల్స్ తో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి భైరవం వంటి సినిమాల ద్వారా ఆయన తన కెరీర్‌ను మరో మలుపు తిప్పుతారా అన్నది వేచి చూడాలి.