Begin typing your search above and press return to search.

మ‌స్క్ రోబోట్ లు ఆ సినిమా నుంచి కాపీనా?

వాటి ధ‌ర‌లు కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   15 Oct 2024 5:59 AM GMT
మ‌స్క్ రోబోట్ లు ఆ సినిమా నుంచి కాపీనా?
X

ఇటీవ‌లే టెస్లా దిగ్గ‌జం ఎలాన్ మస్క్ టెస్లా ఈవెంట్‌లో 'ఆప్టిమస్ రోబోట్‌లను ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ హ్యూమ‌న‌యిడ్ రోబోలో ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌ర్నీ అల‌రించాయి. మ‌నుషులు చేసే ప్ర‌తీ ప‌నిని త‌న రోబోటో ద్వారా చేసి చూపించారు. ప్ర‌త్యేక‌మైన ఈవెంట్ ద్వారా వాటిని లాంచ్ చేసారు. వాటి ధ‌ర‌లు కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.


అయితే మ‌స్క్ రోబోల‌పై రోబోట్ మూవీ ద‌ర్శ‌కుడు అలెక్స్ ప్రోయాస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసాడు. మ‌స్క్ రోబోలు త‌న సినిమాలో రోబోట్ మాదిర‌గా ఉన్నాయ‌ని ఆరోపించారు. ఎలాన్ మ‌స్క్ తీసుకున్న రోబో డిజైన్ అంతా త‌న రోబోట్ డిజైన్ ల నుంచి కాపీ చేసార‌ని ఆరోపించారు. దీంతో ఇప్పుడీ వార్త ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. సినిమాలో డిజైన్ లు...మ‌స్క్ రూపొందిచిన రోబోల‌ను స‌రిపోల్చుతూ రెండింటినీ సోష‌ల్ మీడియాలోకి వ‌దిలారు.

వాటిని చూస్తుంటే మ‌క్కీకి మ‌క్కీ మ‌స్క్ దించిన‌ట్లే క‌నిపిస్తుంది. మ‌రి వీటిపై ఎలాన్ మ‌స్క్ ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారు? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే మ‌స్క్ రోబోల‌కు మార్కెట్ లో మంచి డిమాండ్ మొద‌లైంది. గ‌త వారమే వీటిని లాంచ్ చేయ‌డంతో కొనుగోలు చేసేందుకు డ‌బ్బున్న బ‌డా బాబులంతా ముందుకొస్తున్నారు.

అలెక్స్ ప్రోయాన్ 2004 సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ఐ రోబోట్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో విల్ స్మిత్ హ్యూమనాయిడ్ రోబోట్‌లకు వ్యతిరేకంగా ఉండే నరహత్య డిటెక్టివ్‌గా నటించాడు. ఈ సినిమా అప్ప‌ట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధిస్తుంది. బాక్సాఫీస్ వ‌ద్ద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాలో డిజైన్స్ నే ఎలాన్ మ‌స్క్ కాపీ కొట్టి హ్యామ‌నాయిడ్ రోబోట్ ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆరోపిస్తున్నారు.