Begin typing your search above and press return to search.

అన్న మ‌హేష్ లాగే త‌మ్ముడు తార‌క్!

చివ‌రికి పాన్ ఇండియాలో తెలుగు సినిమా స‌త్తా చాటే స‌రికి అక్క‌డ హీరోలే ఇక్క‌డికొచ్చి సినిమాలు చేసే ప‌రిస్థితి త‌లెత్తింది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 6:21 AM GMT
అన్న మ‌హేష్ లాగే త‌మ్ముడు తార‌క్!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని బాలీవుడ్ లో ఎప్పుడు సినిమా చేస్తార‌ని త‌రుచూ అడిగేవారు. కానీ త‌న‌కెప్పుడు బాలీవుడ్ కి వెళ్లి సినిమా చేసే ఆలోచ‌న లేద‌ని ఎంతో ఓపెన్ గానే చెప్పాడు. తెలుగు సినిమాలే చేస్తానన ని..నా మాతృ భాష తెలుగును వ‌దిలేసి వెళ్ల‌డం దేనికి అన్న‌ట్లు? ఎన్నోసార్లు బ‌ధులిచ్చారు. చివ‌రికి పాన్ ఇండియాలో తెలుగు సినిమా స‌త్తా చాటే స‌రికి అక్క‌డ హీరోలే ఇక్క‌డికొచ్చి సినిమాలు చేసే ప‌రిస్థితి త‌లెత్తింది.

మ‌హేష్ ఇప్పుడు పాన్ ఇండియాలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విజ‌యం త‌ర్వాత అత‌డి రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. పాన్ ఇండియా సినిమా చేయ‌క‌ముందే బాలీవుడ్ హీరోయిన్లు అంతా మ‌హేష్ కి వీరాభీమానులుగా మారారు. ఇక సినిమా చేసి హిట్ కొడితే ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే మ‌హ‌ష్ త‌మిళ్ లో మాత్రం తెలుగుతో పాటు ఏకకాలంలో ఒక‌టి రెండు సినిమాలు చేసారు.

ఆ సినిమాలు అక్క‌డ పెద్ద‌గా స‌రైన ఫ‌లితాలు సాధించ‌లేదు గానీ..ఒక‌ప్పుడు తెలుగు సినిమా త‌మిళ‌నా డులో ఉండేది? అన్న కోణంలో మ‌హేష్ ఆ ర‌కంగా త‌మిళ్ పై ఆస‌క్తి చూపించారు. తాజాగా తార‌క్ కూడా అన్న మ‌హేష్ దారిలోనే క‌నిపిస్తున్నాడు. ఇటీవ‌లే `దేవ‌ర` ప్ర‌మోష‌న్ లో భాగంగ వెట్రీ మార‌న్ ఒకే అంటే త‌మిళ్ సినిమా చేయ‌డానికి నేను సిద్దం అన్నాడు. ఆ ర‌కంగా ప‌ర‌భాష‌కు...ఒక‌ప్పుడు క‌లిసిన ప‌రిశ్ర‌మ‌కు తార‌క్ సైతం ఎంతో రెస్పెక్ట్ ఇచ్చాడు. వాస్త‌వానికి ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత తార‌క్ తో చాలా మంది బాలీవుడ్ ద‌ర్శ‌కులు అక్క‌డ సినిమాలు చేయాల‌నుకున్నారు. క‌ర‌ణ్ జోహార్ లాంటి నిర్మాత‌లు లాగే ప్ర‌య‌త్నం చేసారు. కానీ తార‌క్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు.

ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌తో తార‌క్ ది ఎంతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం. తార‌క్ కూడా క‌న్న‌డిగి. ఆయ‌న బంధువులు, స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. క‌న్న‌డ ఎంతో చ‌క్క‌గా మాట్లాడుతారు. తార‌క్ తెలుగు సినిమాల‌కు అక్క‌డ మంచి డిమాండ్ ఉంది. త‌మిళ్ సైతం ఎంతో బాగా మాట్లాడుతాడు అన్న‌ది తెలిసిందే.