Begin typing your search above and press return to search.

రాజమౌళి, త్రివిక్రమ్.. పూజ ఛాయిస్ కు కారణమేంటో?

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రానున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 10:00 PM GMT
రాజమౌళి, త్రివిక్రమ్.. పూజ ఛాయిస్ కు కారణమేంటో?
X

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపిన అమ్మడు.. ఇప్పుడు అడపాదడపా చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. మంచి హిట్ అందుకుని రెండేళ్లు దాటిపోయంది. గతేడాది కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాతో సరిపెట్టుకున్న పూజ.. ఇప్పుడు మళ్లీ బిజీ అవ్వడానికి ట్రై చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రానున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.

లవ్‌ అండ్‌ వార్‌ నేపథ్యంలో రూపొందుతున్న సూర్య44కు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో సూర్య గ్యాంగ్‌ స్టర్‌ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్ట్ కు గాను తన షూటింగ్ పార్ట్ ను రీసెంట్ గా పూజ కంప్లీట్ చేసుకుంది. ఆ విషయాన్ని ఆమెనే తెలిపింది. దీంతోపాటు బాలీవుడ్ షాహిద్ క‌పూర్‌ తో యాక్ష‌న్ మూవీ దేవా చేస్తోంది పూజా హెగ్డే. కాంచన-4 మూవీలో కూడా ఆమె నటించనున్నట్లు కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదంతా పక్కన పెడితే.. రీసెంట్ గా అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో పాల్గొన్న పూజ మీడియాతో మాట్లాడింది. రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ మూవీస్‌ లో ఒకేసారి సినిమా చేసే ఛాన్స్ వ‌స్తే.. ఎవ‌రి ప్రాజెక్ట్ కు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇస్తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు రాజ‌మౌళి పేరు చెప్పింది పూజ. ఇద్దరూ తనకు ఫేవరేట్ అన్న అమ్మడు.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాజమౌళితో వర్క్ చేయలేదని, అందుకే ఆయన పేరు చెప్పానని తెలిపింది.

ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. త్రివిక్రమ్ అసూయ పడేలా చేయడానికి పూజ అలా చెప్పిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. అందుకు కారణం కూడా ఉందని చెబుతున్నారు. గుంటూరు కారం సినిమా విషయంలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరికొందరు మాత్రం పూజా హెగ్డే వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతున్నారు.

త్రివిక్రమ్, పూజ తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ మూవీ కోసం వర్క్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీలో పూజకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఆ తర్వాత మహేష్ బాబు గుంటూరు కారంతో వారి కాంబో రిపీట్ అవుతుందనుకుంటే.. కొన్ని కారణాల వల్ల అమ్మడు తప్పుకుంది. ఏదేమైనా ఇప్పుడు త్రివిక్రమ్, రాజమౌళిలో ఒకరి ప్రాజెక్ట్ పూజ ఎంచుకున్న విషయం హాట్ టాపిక్ గా మారింది!