ప్రభాస్ స్పిరిట్ .. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే వార్త
ఇంతలోనే సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమాని ప్రారంభించేందుకు ప్రభాస్ సర్వసన్నాహకాల్లో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 1 Feb 2025 4:19 AM GMTప్రభాస్ నటించిన 'రాజా సాబ్' ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు హను రాఘవపూడితో ఫౌజి చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఇంతలోనే సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమాని ప్రారంభించేందుకు ప్రభాస్ సర్వసన్నాహకాల్లో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.
'స్పిరిట్' ఇంటెన్స్ కాప్ యాక్షన్ డ్రామా. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమా కథాంశం డ్రగ్స్ నేపథ్యంలో రక్తి కట్టిస్తుందని సమాచారం. నేపథ్యానికి తగ్గట్టే ఈ సినిమాని ఇండోనేషియా, థాయ్ లాండ్ లాంటి చోట్ల తెరకెక్కిస్తారని కథనాలొచ్చాయి. ఇంతకుముందు ఇండోనేషియా జకార్తాలో షెడ్యూల్ ప్రారంభించే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాని థాయ్ లాండ్ లోని అరుదైన లొకేషన్లలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
తాజా కథనాల ప్రకారం.. సందీప్ వంగా ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాయడం దాదాపు పూర్తి చేశారు. ప్రభాస్ లభ్యతను బట్టి త్వరలో షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారని సమాచారం. అన్నీ సరిగ్గా జరిగితే మే నెలలో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళవచ్చు. ఆ సమయానికి ప్రభాస్ 'ది రాజా సాబ్' పెండింగ్ పనులు పూర్తి చేసి, ఫౌజీ షూటింగ్ లో 50 శాతానికి పైగా పూర్తి చేసే వీలుందని కథనాలొస్తున్నాయి.
స్పిరిట్ - హై ఇంటెన్సిటీ హీరో-విలన్ డ్రామా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కథానాయకుడు- విలన్ మధ్య తీవ్రమైన ఫేసాఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బాహాబాహీ యుద్ధం ఉంటుంది. సినిమాలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. సగ భాగం థాయిలాండ్‌లో కూడా ప్లాన్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
స్పిరిట్ కోసం ప్రభాస్ మేకోవర్ చేయాల్సి ఉంటుందని సమాచారం. ప్రభాస్ ఒక ఇంటెన్సివ్ పాత్రను పోషించి చాలా కాలం అయింది, . స్పిరిట్ లో అతడు కాప్ పాత్రలో పూర్తి ఇంటెన్స్ గా కనిపిస్తాడు. యాక్షన్ కథాంశానికి తగ్గట్టు అతడికి మేకోవర్ చేస్తారు. ఇది అభిమానులకు సర్ ప్రైజింగ్ గా ఉంటుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగా కీలక నటీనటులను కూడా ఖరారు చేశారని, త్వరలో వారి వివరాలను ప్రకటిస్తారని కథనాలొస్తున్నాయి. అలాగే స్పిరిట్‌లో విలన్‌గా ఎవరు నటిస్తారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. సందీప్ ట్రాక్ రికార్డ్‌ను బట్టి, అతడు బహుభాషల నుంచి పెద్ద స్టార్లను ఎంపిక చేస్తాడు. విలన్ పాత్రకు బాలీవుడ్ నుంచి ఎవరైనా ప్రముఖ నటుడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అలాగే కొరియన్ నటుడు డాన్ లీ ఇందులో డ్రగ్ డాన్ గా నటించే వీలుందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే రెడీ చేసారని కూడా గుసగుస వినిపిస్తోంది. నేపథ్య సంగీతాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించడంలో సందీప్ వంగా శ్రద్ధ గురించి తెలిసిందే. సన్నివేశాలను ఇంటెన్స్ గా మలచడానికి.. ప్రేక్షకులపై ప్రభావాన్ని పెంచడానికి తరచుగా షూటింగ్ సమయంలో దానిని ప్లే చేస్తాడు. స్పిరిట్‌ను సందీప్ వంగా భద్రకాళి ప్రొడక్షన్స్‌తో కలిసి టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. 2026 ప్రారంభంలో విడుదల చేయాలనేది ప్లాన్.