Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ ట్రెండులో ట్రిపుల్ షాక్

ఇలా ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకుల స్పందనను భారీగా అందుకున్నాయి.

By:  Tupaki Desk   |   25 Oct 2024 8:15 AM GMT
రీ రిలీజ్ ట్రెండులో ట్రిపుల్ షాక్
X

సినిమా రంగంలో ఇప్పుడున్న పోటీలో ఓటీటీలు అందుబాటులోకి రావడం వల్ల ఎలాంటి కాన్సెప్టులతో వచ్చిన సినిమాలైనా హిట్ కావాలంటే కష్టంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్‌లా మారిపోయింది. ఇలా ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకుల స్పందనను భారీగా అందుకున్నాయి.

పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్‌ను ప్రభాస్ అభిమానులు విభిన్నంగా మార్చేశారు. అతడి పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబర్ 23వ తేదీన ఏకంగా మూడు సినిమాలను.. మరోసారి తెలుగు తెరపైకి తీసుకు వచ్చారు. సూపర్ హిట్లు అయిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సలార్: సీజ్‌ఫైర్’, ‘ఈశ్వర్’ సినిమాలను పండుగలా తీసుకు వచ్చారు. తద్వారా అతడి బర్త్‌డేను మరింత గ్రాండ్‌గా మార్చే ప్రయత్నం చేశారు.

ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన రీ రిలీజ్ సినిమాలు మొత్తానికి దాదాపుగా మంచి స్పందనే వచ్చింది. మరీ ముఖ్యంగా ఖుషి ‘ఇంద్ర’, ‘జల్సా’, ‘మురారి’, ‘సింహాద్రి’ వంటి సినిమాలు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించాయి. కానీ, ప్రభాస్ నుంచి వచ్చిన మూడు చిత్రాలకు కూడా ఆశించిన రీతిలో ఆదరణ లభించలేదు అనే చెప్పుకోవాలి.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సినిమాల్లో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కాసింత స్పందనను అందుకుంది. తద్వారా మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. కానీ, ప్రభాస్ రేంజ్‌ను ఇది ఏమాత్రం నిలబెట్టలేకపోయింది. ఇక, ‘ఈశ్వర్’ సినిమా వచ్చిన విషయాన్ని కూడా చాలా మంది పట్టించుకోలేదు. ‘సలార్: సీజ్‌ఫైర్’ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే మారింది.

మొత్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే కానుకగా వచ్చిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సలార్: సీజ్‌ఫైర్’, ‘ఈశ్వర్’ సినిమాలు నిరాశనే ఎదుర్కొన్నాయని చెప్పొచ్చు. దీంతో వీటికి చాలా వరకూ పెట్టిన ఖర్చులు కూడా రాలేదని అంటున్నారు. ఫలితంగా ఈ మూడు రీ రిలీజ్‌ల విషయంలో రెబెల్ స్టార్ ప్రభాస్‌కు షాక్ తగిలిందనే చెప్పుకోవాలి.

రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజును మరో రేంజ్‌లో జరపాలని అక్టోబర్ 23వ తేదీన ఏకంగా ఆరు సినిమాలను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. అందుకే ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సలార్: సీజ్‌ఫైర్’, ‘ఈశ్వర్’ చిత్రాలను మాత్రమే తీసుకు వచ్చి.. ‘మిర్చి’, ‘ఛత్రపతి’, ‘రెబెల్’ సినిమాల విడుదలను ఆపేశారు. లేకుంటే వాటికి కూడా ఇదే పరిస్థితి ఉండేదేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.