మొన్న విజయ్.. నిన్న రష్మిక.. మేళాలు మోగడమే లేటా?
దీంతో వారిద్దరినీ జంటగా చూడాలని అనేక మంది ఆశపడుతున్నారు.
By: Tupaki Desk | 25 Nov 2024 4:11 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై వారిద్దరి నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ అంతా ఫిక్స్ అయిపోయారు. ఆన్ స్క్రీన్ జోడీల్లో రష్మిక, విజయ్ పెయిర్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ఉందనే చెప్పాలి. దీంతో వారిద్దరినీ జంటగా చూడాలని అనేక మంది ఆశపడుతున్నారు.
అయితే ఇప్పుడు అది త్వరలోనే నిజం కానుందని, సన్నాయి మేళాలు మోగడమే లేటని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అందుకు కారణం ఒక ఫోటో అండ్ రష్మిక కామెంట్సే. రెస్టారెంట్ లో విజయ్, రష్మిక కలిసి తింటున్న పిక్ నిన్న ఉదయం నెట్టింట తెగ వైరల్ అయింది. కొద్ది రోజుల క్రితమే విజయ్ తాను కోస్టార్ తో డేటింగ్ చేశానని చెప్పడంతో ఆ ఫోటో అందరినీ ఎట్రాక్ట్ చేసింది.
దీంతో మరెప్పుడు లవ్ కహానీ అనౌన్స్ చేస్తారని నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో విజయ్, రష్మికను తెగ క్వశ్చన్ చేశారు. అదే సమయంలో నిన్న రాత్రి మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప సీక్వెల్ ఈవెంట్.. చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు రష్మిక కూడా హాజరై స్టేజీపై మాట్లాడారు. అప్పుడు రిలేషన్ షిప్ స్టేటస్ పై ఓపెన్ అయ్యారు. దీంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
'మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా? లేక..' అంటూ యాంకర్ అడగ్గా.. 'అది అందరికీ తెలిసిన విషయమే' అంటూ రష్మిక నవ్వుతూ చెప్పారు. సిగ్గు పడుతున్నట్లు కనిపించారు. దీంతో ఒక్కసారిగా అంతా ఫుల్ గా నవ్వుతూ కేకలు పెట్టారు. అల్లు అర్జున్, శ్రీలీల కూడా చప్పట్లు కొడుతూ నవ్వారు. అయితే యాంకర్.. మరో హింట్ ఇవ్వండని అడగ్గా.. పర్సనల్ గా చెబుతూ అంటూ రష్మిక నవ్వేశారు.
దీంతో రష్మిక.. రిలేషన్ షిప్ స్టేటస్ పై ఎట్టకేలకు ఓపెన్ అయిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె కచ్చితంగా విజయ్ దేవరకొండ కోసమే చెప్పారని అంటున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదని కామెంట్స్ పెడుతున్నారు. రెస్టారెంట్ లో దిగిన పిక్ లీక్ అయిన కొన్ని గంటలే.. అందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించడంతో విజయ్ తో ఆమె డేటింగ్ లో ఉన్న విషయం క్లియర్ గా అర్థమవుతోందని, వెయిటింగ్ ఫర్ అనౌన్స్మెంట్ అంటూ సందడి చేస్తున్నారు.
మొత్తానికి రష్మిక, విజయ్ లవ్ మ్యాటర్ ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వారిద్దరూ రెండు సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో మెప్పించారు. ఇప్పుడు రీల్ జోడీ కాస్త.. రియల్ జోడీ అవ్వాలని అంతా ఆశిస్తున్నారు. మరి వారిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడు బయటపెడతారో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో వేచి చూడాలి.