Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. వచ్చినట్లే వచ్చి..

ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి మిశ్రమ స్పందన వచ్చింది.

By:  Tupaki Desk   |   9 Oct 2024 6:15 AM GMT
గేమ్ చేంజర్.. వచ్చినట్లే వచ్చి..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోయే ‘గేమ్ చేంజర్’ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ సినిమా ప్లానింగ్ పై ఒక క్లారిటీ మాత్రం రావడం లేదు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం ఈ మూవీ షూటింగ్ మొదలవడంతో సినిమాపై బజ్ కొంచెంకొంచెంగా తగ్గిపోయింది. ఈ రెండు నెలల్లోనే మేకర్స్ మూవీకి హైప్ తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి మిశ్రమ స్పందన వచ్చింది.

భారీ ఎక్స్ పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేయలేదు. మూవీ కంటెంట్ ఎలా ఉంటుందో తెలిస్తే సినిమాపై ఎంతో కొంత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దసరాకి ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాత్రం ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయ్యే న్యూస్ చెప్పాడు.

దసరాకి టీజర్ రావడం లేదని బాధపడొద్దు. ప్రతి నెల కచ్చితంగా ఒక సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సాంగ్స్ అన్ని సిద్ధం అయిపోయాయి. లిరికల్ వీడియోస్ ని రిలీజ్ చేయబోతున్నాము. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 20న మూవీ రిలీజ్ కావడం ఖాయం. అందులో ఎలాంటి మార్పు ఉండదు అంటూ థమన్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ తో దసరాకి టీజర్ రిలీజ్ కావడం లేదనే థమన్ క్లారిటీ ఇచ్చేశాడు. దాని స్థానంలో ఏదైనా సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ అయితే టీజర్ వస్తుందని చాలా ఆశపడ్డారు. అయితే ఇప్పుడు వారందరిని థమన్ ఒక్క ట్వీట్ తో నిరాశకి గురిచేసాడని చెప్పొచ్చు. ఈ సాంగ్స్ ఏ మేరకు సినిమాకి బూస్టింగ్ తీసుకొని వస్తాయో ఏమీ చెప్పలేం.

ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ తరహాలోనే మిగిలిన పాటలన్నీ ఉంటే మూవీ అన్ని భాషలలో ప్రేక్షకులకి రీచ్ కాకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉండగానే బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేసే పనిలో దిల్ రాజు ఉన్నారు. సినిమా బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో 300 కోట్ల వరకు ఈ సినిమాపై బిజినెస్ జరుగుతుందని నిర్మాత దిల్ రాజు ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాపై పబ్లిక్ అటెన్షన్ పెద్దగా లేని నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్ పరంగా అంచనాలను అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. శంకర్ ఇండియన్ 2 మూవీ ఇంపాక్ట్ కూడా ఈ చిత్రంపై పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.