పొట్టితనమే ఫేట్ .. లైఫ్ గేమ్ ఛేంజింగ్ ఛాన్స్ మిస్!
తాను హీరో కంటే ఎక్కువ ఎత్తు ఉండటంతో జాక్ పాట్ మిస్సయింది.
By: Tupaki Desk | 4 Jan 2025 8:30 PM GMTజీవితాన్ని మార్చేది ఒకే ఒక్క ఛాన్స్.. ఫేట్‌ను తారుమారు చేసేది ఒకే ఒక్క సినిమా. అలాంటి ఒక్క సినిమాని కోల్పోయింది ఈ నటి. తాను హీరో కంటే ఎక్కువ ఎత్తు ఉండటంతో జాక్ పాట్ మిస్సయింది. హీరో కంటే పొట్టిగా ఉన్న హీరోయిన్ కావాలని మేకర్స్ ఆమెను పక్కన పెట్టారట.
సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అయిన మూడు దశాబ్ధాల తర్వాత ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పుకుని తన దురదృష్టానికి చింతించింది సదరు నటీమణి. ఈ నటి పేరు ఉపాసన సింగ్. సల్మాన్ ఖాన్ క్లాసిక్ హిట్ మూవీ 'మైనే ప్యార్ కియా'లో మొదట కథానాయికగా ఎంపికైంది ఈమెనే. భాగ్యశ్రీ కంటే ముందు ఆ పాత్రకు తాను ఎంపికయ్యానని తాజా ఇంటర్వ్యేలో వెల్లడించింది. దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఎంపిక చేసిన తర్వాత, షాకింగ్ కారణంతో తనను రీప్లేస్ చేసారు. సల్మాన్ ఖాన్ తో సరిపోలేలా పొట్టి హీరోయిన్ కావాలని దర్శకనిర్మాతలు భావించారు. దీంతో తనను రీప్లేస్ చేసి భాగ్యశ్రీకి అవకాశం కల్పించారు. అలా ఓవర్‌నైట్ లో భాగ్యశ్రీ బిగ్గెస్ట్ స్టార్ గా మారారు. ఉపాసన సింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాలీవుడ్ లో సెటిలయ్యారు. అదృష్టవశాత్తూ ఉపాసన సింగ్ కూడా బిజీ నటి.
హీరో కంటే హీరోయిన్ కొంత ఎత్తు తక్కువగా ఉండటం మంచిదే. దానివల్ల స్క్రీన్ పై జంటను చూడటానికి బావుంటుంది. అయితే అది 80లలో కాబట్టి. ఇటీవలి కాలంలో దక్షిణాదిన సూర్య లాంటి ఎత్తు తక్కువ ఉన్న హీరో సరసన అనుష్క లాంటి ఒడ్డు పొడుగు ఉన్న హీరోయిన్ ని కెమెరా జిమ్మిక్కులతో సింగం ఫ్రాంఛైజీలో ఒప్పించాడు హరి. ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కలిసి చాలా మ్యాజిక్ చేయడానికి అవకాశం ఉన్నా కొందరు మాత్రమే చేయగలరు.