మట్కా బడ్జెట్ పెద్దదే కానీ.. నిర్మాత సేఫ్ గేమ్
అసలే డిజాస్టర్స్ తో మార్కెట్ పరంగా డౌన్ అయ్యి ఉన్న వరుజ్ తేజ్ మీద ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టడం అంటే రిస్క్ అని అందరూ అనుకున్నారు.
By: Tupaki Desk | 10 Nov 2024 4:59 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. ఈ సినిమా నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే వరుసగా ‘గని’, ‘గాండీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలతో ఫ్లాప్ లలో ఉన్న వరుణ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ‘మట్కా’ తెరకెక్కింది.
వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాపై ఏకంగా 45 కోట్ల బడ్జెట్ పెట్టారంట. అసలే డిజాస్టర్స్ తో మార్కెట్ పరంగా డౌన్ అయ్యి ఉన్న వరుజ్ తేజ్ మీద ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టడం అంటే రిస్క్ అని అందరూ అనుకున్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ కి ఇప్పటి వరకు ‘పలాస’ మూవీ ద్వారా మాత్రమే సక్సెస్ వచ్చింది. ఆయన కెరియర్ లో కూడా హైయెస్ట్ బడ్జెట్ చిత్రం ఇదే. అయితే పీరియాడిక్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమాని కరుణ కుమార్ తెరకెక్కించారు.
అలాగే మూడు టైం లైన్స్ లో ఈ కథ నడుస్తుంది. అందుకే ఈ స్థాయిలో బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బడ్జెట్ భారీగా పెట్టిన కూడా ‘మట్కా’ మూవీకి అద్భుతమైన బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. బిజినెస్ పరంగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అందుకున్నామని నిర్మాతలు తెలిపారు. అంటే టేబుల్ ప్రాఫిట్ తోనే ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని వస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా భారీ లాభాలు రావడం గ్యారెంటీ అనుకుంటున్నారు.
ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండటం పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. వరుణ్ తేజ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. మూడు వేరియేషన్స్ లో అతని క్యారెక్టర్ ఉండబోతోంది. మెగా ఫ్యాన్స్ ఫోకస్ కూడా ఈ సినిమాపై గట్టిగానే ఉంది. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా వరుణ్ తేజ్ కి మళ్ళీ స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ అవుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
పాన్ ఇండియా అప్పీల్ తో సినిమాలు చేయడం వలన కచ్చితంగా అతనికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి కథలని నార్త్ ఇండియన్ ఆడియన్స్ బాగానే ఆదరిస్తారు. అందుకే అక్కడ కూడా సక్సెస్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ‘మట్కా’ మూవీతో వరుణ్ తేజ్ గట్టి హిట్ అయితే కొట్టాల్సిన అవసరం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.