గేమ్ ఛేంజర్ గెస్ట్ ఎవరంటే..?
ఎన్నో రోజుల నుంచి సినిమా ట్రైలర్ అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా చూశారు.
By: Tupaki Desk | 1 Jan 2025 4:43 PM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించారు. సినిమా లో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియరా అద్వాని నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ అన్ని కూడా ఫ్యాన్స్ ని అలరించాయి. ఐతే గేం ఛేంజర్ సినిమా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి సినిమా ట్రైలర్ అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా చూశారు.
ఐతే గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. జనవరి 2న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. జనవరి 2న హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా దర్శ్క ధీరుడు రాజమౌళి వస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో చరణ్ మగధీరతో పాటు RRR సినిమా చేశాడు. రెండు సినిమాలు సంచనల విజయాలు అందుకున్నాయి.
రామ్ చరణ్ గురించి రాజమౌళి మంచి ఒపీనియన్ తో ఉన్నారు. RRR ప్రమోషన్స్ లో చరణ్ ని ఆంజనేయుడితో పోల్చారు. హనుమాన్ లా తన బలం ఎంత అన్నది రామ్ చరణ్ కి తెలియదని అన్నారు. ఐతే ఇప్పుడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా వచ్చి ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు శంకర్ మీద రాజమౌళికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఆయన కోసం రాజమౌళి ఈ ఈవెంట్ కి వస్తున్నారని చెప్పొచ్చు.
గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ అని తెలియగానే మెగా ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. జనవరి 10న గేమ్ ఛేంజర్ వస్తుంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మంచి సోషల్ మెసేజ్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాతో శంకర్ మరోసారి తన మార్క్ కమర్షియల్ హిట్ అందుకుంటారని అంటున్నారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చరణ్ మాత్రం ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. దిల్ రాజు కూడా సినిమా తప్పనిసరిగా హిట్టు కొడుతుందని చెబుతున్నారు.