Begin typing your search above and press return to search.

ఈ రొమాన్స్ ఊహించలేదు నాని!

ఇలాంటి క్లాస్ కూల్ సినిమాతో నాని పాన్ ఇండియా మార్కెట్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 9:44 AM GMT
ఈ రొమాన్స్ ఊహించలేదు నాని!
X

నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా సినిమాతో తన కెరీర్ లోనే బిగ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ను చూశాడు. ఇక పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టిన నాని ఇప్పుడు రాబోయే హయ్ నాన్న సినిమాతో కూడా మరోసారి సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్ ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.


ఇలాంటి క్లాస్ కూల్ సినిమాతో నాని పాన్ ఇండియా మార్కెట్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మాత్రమే కాకుండా అందమైన ప్రేమ జంట మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

నాని కి జోడిగా మృణాల ఠాగూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరి కలయికలో రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో కాంబినేషన్ పరంగా కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమాకు సంబంధించిన అమ్మాడి అనే మరొక పాటను నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక ఆ పాటకు సంబంధించిన ఒక స్టిల్ అయితే విడుదల చేశారు. అందులో నాని మృణాల్ ఠాగూర్ హత్తుకుని ఉన్న స్టిల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

చూస్తుంటే ఇందులో ఈ జోడి మధ్యలో అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లుగా తెలుస్తోంది. నాని ప్రతి సినిమాలో కూడా రొమాంటిక్ బాయ్ వేషాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా హైలెట్ కాబోతున్నట్లు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న హాయ్ నాన్న మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానుంది.

ఈ పాన్ ఇండియా సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించగా, మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ట్రేండింగ్ లో నిలుస్తున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం) మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. హాయ్ నాన్నా డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.