ముంబై..మలేషియాని తాడేపల్లికే తెస్తున్నారా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా `ఓజీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Aug 2024 12:30 PM GMTఇటీవలే పవన్ కళ్యాణ్ ని మూడు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు స్వయంగా కలిసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ తమ సినిమా షూటింగ్ లను వీలైతే హైదరాబాద్ నుంచి తాడేపల్లికి మార్చుకోవానలి కోరినట్లు ప్రచారం లోకి వచ్చింది. మరి వీళ్లలో ముందుకొస్తున్న నిర్మాతలు ఎవరు? అంటే దానయ్య పేరు తెరపైకి వస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా `ఓజీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
దీన్ని దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. అయితే బ్యాలెన్స్ షూటింగ్ కోసం `ఓజీ` టీమ్ ఇప్పుడు తాడేపల్లి పరిసరాలకు షిప్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు గుస గుస వినిపిస్తుంది. తాడేపల్లికి సమీపంలోనే `ఓజీ` సెట్స్ వేయాలని ప్లాన్ చేసుకుం టున్నారుట. అంటే ముంబై, మలేషియా లొకేషన్ల ప్రాంతాన్ని తాడేపల్లికి తేవడం అన్నట్లే కదా. ఇది గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రం.
ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ముంబై...మలేషియాలోనే జరిగింది. అవసరం మేర హైదరాబాద్ కొన్ని సెట్లు వేసి మరికొంత షూట్ నిర్వహించారు. అయితే పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా తాడేపల్లిని వదిలి వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేకపోవడంతో దానయ్య తెగించి తాడేపల్లికి వచ్చేస్తున్నట్లు కనిపిస్తుంది. పవన్ డేట్లు దొరకడమే మహాభాగ్యంగా నిర్మాతలు భావిస్తున్నారు. అందులోనూ పొలిటికల్ గా బిజీగా ఉన్న సమయంలో డేట్లు ఇంకా కష్టం.
అందుకే దానయ్య మరో ఆలోచన లేకుండా దూసుకొస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే పవన్ సెప్టెంబర్ లేదా? అక్టోబర్ నుంచి `ఓజీ` షూట్ లోనే పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. అంటే ఆలోపు తాడేపల్లిలో సెట్ల నిర్మాణం పూర్తి చేయాలి. సెట్లు వేయడానికి చాలా సమయం పడుతుంది. ఆ లెక్కన చూస్తే సెప్టెంబర్ అంతా అందుకే సమయం పడుతుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.