సల్మాన్ ఖాన్ కూడా బాలయ్య టైపేనా?
అంటే ఆయన కూడా ఆన్ ది కెమెరా అయినా..ఆఫ్ ది కెమెరా అయిన ఒకేలా ఉంటారుట.
By: Tupaki Desk | 22 May 2024 2:30 AM GMTహీరోలంతా కెమెరా ముందు ఎలా ఉంటారో తెలిసిందే. ఎంతో సౌమ్యంగా..హృందాగా ఉంటారు. మరి ఆన్ సెట్స్ లో ఎలా ఉంటారు? ఆఫ్ ది కెమెరా ఎలా నడుచుకుంటారు? అంటే ఎవరికి నచ్చినట్లు వారుంటారు. మరి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఎలా ఉంటాడు? అంటే ఆయన కూడా ఆన్ ది కెమెరా అయినా..ఆఫ్ ది కెమెరా అయిన ఒకేలా ఉంటారుట. సల్మాన్ ఖాన్ కి కోపం ఎక్కువట. షూటింగ్ సెట్స్ లో ఎక్కువగా అరుస్తాడుట. రిలాక్స్ మోడ్ లో ఉంటే పర్వాలేదుట.
కానీ షూటింగ్ సమయంలో ఎవరైనా డిస్టబెన్స్ చేసినా..అసౌకర్యానికి గురి చేసినా శివ తాండవం ఆడేస్తాడుట. కోపం తన్నుకుని టన్నుల కొద్ది వచ్చేస్తుందిట. వెనుకా..ముందు ఆలోచించకుడా మాటలతో దాడి చేస్తాడుట. కానీ అటుపై కూల్ అయిన తర్వాత కూడా అంతే వాళ్లను బుజ్జగిస్తాడుట. అనవసరం గా కోపగించుకున్నానని సారీ కూడా చెప్పేస్తారుట. సల్మాన్ కి తనమన ఆనే బేధం ఉండదట. సెట్స్ లో అందర్నీ ఒకేలా ట్రీట్ చేస్తారుట. స్టార్ హీరో అనే భావాన్ని ఎక్కడా చూపించరుట.
లంచ్ సమయంలో చిన్న చిన్న ఆర్టిస్టులతోనూ కలిసి భోజనం చేస్తారుట. వాళ్లతో సరదాగా జోకులు వేస్తారుట. స్పాట్ లో కూర్చోవడానికి కుర్చీలు అందుబాటులో లేకపోయినా అందరితో కలిసి కిందనే కూర్చుని సమభావం చూపిస్తా రుట. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని ఓ సీనియర్ నటుడు తెలిపారు. కాకపోతే కాస్త కోపం ఎక్కు..అదీ ఎక్కువ సేపు కాదు అనేసారు.
ఇక టాలీవుడ్ లో హీరోల్లో కోపగించుకునేది? ఎవరు అంటే అంతా బాలయ్య పేరు చెబుతారు. కానీ ఆయన మనసు కూడా వెన్నే. అదీ కోపం కాదు..తనలో ప్రేమని కోపం రూపంలో చూపిస్తారని అంటారు. ఇటీవలే ఓ బాలుడితో బాలయ్య సీరియస్ గా ఉన్న ఓ వీడియో రిలీజ్ అయింది. అందులో ఆ బాలుడిపై బాలయ్య సీరియస్ అయినట్లు కనిపిస్తుంది. కానీ అదంతా బాలయ్య చూపించే ప్రేమ మాత్రమే అన్నది అందరికీ తెలిసిందే.