Begin typing your search above and press return to search.

కుమార్తెకి శంక‌ర్ ఛాన్స్ ఇచ్చాడా?

ప్ర‌స్తుతం న‌టిస్తోన్న ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్ లో ఉండ‌గా, మ‌రో సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

By:  Tupaki Desk   |   29 July 2024 11:27 AM GMT
కుమార్తెకి శంక‌ర్ ఛాన్స్ ఇచ్చాడా?
X

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అతిది శంక‌ర్ హీరోయిన్ గా కోలీవుడ్లో ఎట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టీకే హీరోయిన్ గా మూడు సినిమాలు చేసింది. `మావీర‌న్` సినిమాతో అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో శివ కార్తీకేయ‌న్ కి జోడీగా న‌టించింది. ప్ర‌స్తుతం న‌టిస్తోన్న ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్ లో ఉండ‌గా, మ‌రో సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

అలాంటి అతిధి డాడ్ సినిమాకి ప్ర‌మోట్ అవుతుందా? శంక‌ర్ పిలిచి మ‌రీ కుమార్తెకి అవ‌కాశం ఇస్తున్నా డా? అంటే అవున‌నే తెలుస్తోంది. శంక‌ర్ త‌దుప‌రి `వేల‌ప్ప‌న్` న‌వ‌ల ఆధారంగా ఓసినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరో ఎవ‌రు? అన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. కానీ హీరోయిన్ గామాత్రం ఛాన్స్ కుమార్తెకే ఇవ్వాల‌నిఫిక్స్ అయ్యార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది.

న‌వ‌ల లో హీరోయిన్ పాత్ర‌కి అతిది ప‌ర్పెక్ట్ గా సూట‌వుతుంద‌ని శంక‌ర్ భావిస్తున్నారుట‌. అయినా స‌రే అతిది పై టెస్ట్ షూట్ నిర్వ‌హించిన త‌ర్వాతే శంక‌ర్ ఫైన‌ల్ చేస్తార‌ని చెబుతున్నారు. క్యాస్టింగ్ ఎంపిక‌లో శంక‌ర్ ప‌ర్పెక్ష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అస‌లు రాజీ ప‌డే ప్ర‌శ్నే ఉండ‌దు. అంతా ప‌క్కాగా ఉంటేనే ఎంపిక చేస్తారు.

ప్ర‌స్తుతం శంక‌ర్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ `గేమ్ ఛేంజ‌ర్` తెరకెక్కిస్తోన్న‌సంగ‌తి తెలిసిందే. మ‌రో ప‌ది రోజుల్లో షూటింగ్ మొద‌ల‌వుతుంది. అటుపై రిలీజ్ తేది ప్ర‌క‌టిస్తారు. `భార‌తీయుడు 3` పూర్తి చేసే అవ‌కాశం ఉంది. అయితే ఇటీవ‌ల రిలీజ్ అయిన `భార‌తీయుడు 2` భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చినా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మూడ‌వ భాగం ఉంటుందా? ఉండ‌దా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. మూడ‌వ భాగంలో సిస‌లైన క‌మ‌ల్ హాస‌న్ హైలైట్ అవుతాడ‌ని రెండ‌వ భాగం క్లైమాక్స్ లో రివీల్ చేసారు.