విజయ్.. నిర్మాతకు టోటల్ గా అంత ప్రాఫిట్ వచ్చిందా?
అయితే లియోలో చూపించిన ఫ్లాష్ బ్యాక్ స్టొరీ రియల్ కాదని, అసలు ఒరిజినల్ ఏంటి అనేది పార్ట్ 2లో చూపిస్తా అంటూ లోకేష్ ఇష్యూని డైవర్ట్ చేశారు.
By: Tupaki Desk | 21 Nov 2023 3:53 AM GMTఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం లియో. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ గత సినిమాల తరహాలో అప్ టు ది మార్క్ లేదనే విమర్శలు వినిపించాయి. అలాగే బలమైన హీరో బ్యాక్ స్టొరీ లేకపోవడం కూడా మైనస్ అని సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అయితే లియోలో చూపించిన ఫ్లాష్ బ్యాక్ స్టొరీ రియల్ కాదని, అసలు ఒరిజినల్ ఏంటి అనేది పార్ట్ 2లో చూపిస్తా అంటూ లోకేష్ ఇష్యూని డైవర్ట్ చేశారు.
అయితే డివైడ్ టాక్ తోనే మొదలైన మూవీ లాంగ్ రన్ లో 600 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ అయితే ప్రకటించింది. అది ఎంత వరకు వాస్తవం అనేది క్లారిటీ లేదు. కాని రిలీజ్ అయిన అన్ని ప్రాంతాలలో, భాషలలో బ్రేక్ ఈవెన్ అయితే వచ్చిందని ట్రేడ్ పండితుల మాట. బయ్యర్లు ఎవరూ కూడా లియో సినిమా కారణంగా నష్టపోలేదని తెలుస్తోంది. అయితే నిర్మాతకి మాత్రం లియో మూవీతో ఏకంగా 100 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
లియో మూవీకి సుమారు 350 కోట్ల వరకునిర్మాత బడ్జెట్ పెట్టారు. అయితే రిలీజ్ కి ముందే సినిమాపై ఏకంగా 450 కోట్ల వ్యాపారం జరిగింది. అందులో నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా 210 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇక థీయాట్రికల్ రైట్స్ ద్వారా 250 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే సినిమాకి బ్రేక్ ఈవెన్ రావడంతో ఈ థీయాట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే డబ్బు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈ లెక్కన 350 కోట్ల పెట్టుబడి పెడితే 100 కోట్లు లాభాలు లియో సినిమా ద్వారా నిర్మాతకి వచ్చాయి. ఈ ఏడాదిలో కోలీవుడ్ లో జైలర్ మూవీ అత్యధిక లాభాలు అర్జించింది. తరువాత లియోనే ఉంటుంది. సౌత్ లో కూడా అత్యధిక ఆదాయం ఆర్జించిన సినిమాల జాబితాలో టాప్ 2లో ఈ రెండు మూవీస్ ఉండటం విశేషం. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్త, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకులుగా కనిపించారు.
టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు అయితే చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. డిసెంబర్ లో సలార్ మూవీ వస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలో కలెక్షన్స్ పరంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.