Begin typing your search above and press return to search.

'పుష్ప 2' ఆఫ‌ర్.. జీవితంలో నిజం చెప్పను: సేతుప‌తి

అయితే పుష్ప 2 లాంటి క్రేజీ సినిమాకి సేతుప‌తి ఎందుకు అంగీక‌రించ‌లేదు? అన్న డౌట్ బ‌న్ని ఫ్యాన్స్ లో అలానే ఉంది. దీనికి ఇప్పుడు సేతుప‌తి స‌మాధానం ఇచ్చారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 2:01 PM GMT
పుష్ప 2 ఆఫ‌ర్.. జీవితంలో నిజం చెప్పను: సేతుప‌తి
X

త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి నికార్స‌యిన పాన్ ఇండియన్ స్టార్ గా వెలిగిపోతున్నాడు. క‌మ‌ల్ హాస‌న్, విక్ర‌మ్ లాంటి విల‌క్ష‌ణ న‌టుల‌ త‌ర్వాత ఒక ర‌కంగా సేతుప‌తిని ఆ స్థాయిలో గౌర‌విస్తున్న స‌న్నివేశం చూస్తున్నాం. అందుకే పాన్ ఇండియా నిర్మాతలందరికీ విజయ్ సేతుపతి ఒక లక్కీ చార్మ్‌గా క‌నిపిస్తున్నాడు. తమిళంలోనే కాకుండా దేశంలోని ఇతర సినీప‌రిశ్ర‌మ‌ల‌ నుండి భారీ మల్టీ-స్టారర్‌లలో న‌టించాల్సిందిగా అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సైరా- ఉప్పెన లాంటి మెగా సినిమాల త‌ర్వాత తెలుగులో అత‌డికి చాలా ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. కానీ అత‌డు సెల‌క్టివ్ గా న‌టిస్తున్నాడు.

అదే క్ర‌మంలో బ‌న్ని న‌టించిన పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ పుష్ప సీక్వెల్లోను న‌టించే అవ‌కాశం సేతుప‌తిని వ‌రించింద‌ని ప్ర‌చార‌మైంది. భారతదేశం అంతటా మాస్‌లో ఆదరణను క్యాష్ చేసుకోవడానికి సుకుమార్ బృందం సేతుప‌తికి ఆఫ‌ర్ ఇచ్చింద‌ని ప్ర‌చార‌మైంది. సీక్వెల్‌లో విలన్ పాత్రను సేతుపతికి ఆఫర్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అత‌డు ఆ చిత్రంలో న‌టించ‌లేదు. ఇంత‌కుముందు క‌మ‌ల్ హాస‌న్, ఫ‌హ‌ద్ ల‌తో క‌లిసి క‌న‌గ‌రాజ్ విక్ర‌మ్‌లో అద్భుత‌మైన పాత్ర‌తో మైమ‌రిపించాడు.

అయితే పుష్ప 2 లాంటి క్రేజీ సినిమాకి సేతుప‌తి ఎందుకు అంగీక‌రించ‌లేదు? అన్న డౌట్ బ‌న్ని ఫ్యాన్స్ లో అలానే ఉంది. దీనికి ఇప్పుడు సేతుప‌తి స‌మాధానం ఇచ్చారు. విజ‌య్ సేతుప‌తి న‌టించిన హిందీ సినిమా 'మ‌హారాజా' స‌క్సెస్ మీట్లో సేతుప‌తికి ఇదే ప్ర‌శ్న ఎదుర‌వ్వ‌గా దానికి స‌మాధానం ఇచ్చాడు. పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్ 'పుష్ప 2'లో ఆఫ‌ర్ వ‌చ్చినా తిర‌స్క‌రించార‌ట క‌దా? అన్న ప్ర‌శ్కకు స‌మాధానంగా.. తాను తిర‌స్క‌రించ‌లేదు! అని అన్నాడు సేతుప‌తి. జీవితంలో అన్నిసార్లు ప్ర‌శ్న‌ల‌కు నిజాయితీగా స‌మాధానం ఇవ్వ‌కూడ‌ద‌ని న‌వ్వేశాడు. అలాగే చ‌ర‌ణ్- బుచ్చిబాబు చిత్రంలోను తాను న‌టిస్తున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని క్లారిటీనిచ్చాడు. తాను న‌టించిన మ‌హారాజా సినిమాకి సీక్వెల్ ఉండ‌బోద‌ని అన్నాడు.