Begin typing your search above and press return to search.

అనుష్క కంటే ముందు విరాట్‌తో రెండేళ్లు ప్రేమ‌లో?

బాలీవుడ్ ట్యాలెంటెడ్ గ‌ర్ల్ అనుష్క శ‌ర్మ‌తో డేటింగ్ ప్రారంబించ‌క ముందు విరాట్ మ‌న‌సు దోచిన మ‌రో అంద‌గ‌త్తె కూడా ఉంది.

By:  Tupaki Desk   |   5 May 2024 12:30 AM GMT
అనుష్క కంటే ముందు విరాట్‌తో రెండేళ్లు ప్రేమ‌లో?
X

విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ జంట ప్రేమాయ‌ణం, పెళ్లి అంతా ఒక అంద‌మైన క‌ల‌. ఇప్పుడు ఈ జంట‌కు ఒక కుమార్తె కూడా ఉంది. వ‌న్ ఫైన్ డే డెస్టినేష‌న్ వెడ్డింగ్ తో ఒక‌ట‌య్యే ముందు ఈ జంట షికార్లు నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచేవి. అయితే విరాట్ ఒక్క‌రితోనే డేటింగ్ చేసాడా? అనుష్క‌ను ప్రేమించ‌క ముందు ఎవ‌రితోను డేటింగ్ చేయ‌లేదా? అంటే దానికి స‌మాధానం ఇక్క‌డ ఉంది.

బాలీవుడ్ ట్యాలెంటెడ్ గ‌ర్ల్ అనుష్క శ‌ర్మ‌తో డేటింగ్ ప్రారంబించ‌క ముందు విరాట్ మ‌న‌సు దోచిన మ‌రో అంద‌గ‌త్తె కూడా ఉంది. ఈ బ్యూటీ పేరు ఇజ‌బెల్లా లైట్. ఈ విదేశీ అంద‌గ‌త్తెకు విరాట్ అత్యంత స‌న్నిహితుడు. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా త‌న‌కు స్నేహితుడు అని ఇజ‌బెల్లా ప‌లుమార్లు వెల్ల‌డించింది. కానీ ఆ ఇద్ద‌రిలో ఎవ‌రిని ప్రేమించింది? అనే విష‌యాన్ని కూడా ఓ ఇంట‌ర్వ్యూలో ఓపెనైంది.

పురాణీ జీన్స్‌లో తనూజ్ విర్వాణితో కలిసి నటించిన జాబెల్లె లైట్ అందానికి భార‌తీయులు ఫిదా అయిపోయారు. కాల‌క్ర‌మంలో క‌ర‌ణ్ జోహార్ కాఫీ షోలో ఇజ‌బెల్లా ప్ర‌త్య‌క్ష‌మైంది. విరాట్ తో స్నేహాన్ని ఈ బ్యూటీ ఖండించ‌లేదు. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా స్నేహితుడు అని కూడా తెలిపింది. ఇప్ప‌టికీ తాము కలుస్తుంటామ‌ని వెల్ల‌డించింది. నా మగ స్నేహితుల మీద ఈ రకమైన శ్రద్ధ .. ఇప్ప‌టికి మూడు అనుభ‌వాల‌తో ముడిప‌డి ఉన్నాయి. కానీ నేను చాలా ఇబ్బందిగా భావిస్తున్నాను. నేను నా పని గురించి తప్ప ప్రతిచోటా కనిపించాలని వినిపించాలని కోరుకునే అమ్మాయిని కాదు... అని తెలిపింది.

ఇజాబెల్లె తన జీవితంపై మీడియా అస‌త్యాలు రాసింద‌ని వాపోయింది. ``మీడియాలోని కొన్ని వర్గాలు నా గురించి చాలా ఎక్కువ ప్ర‌చారం చేసాయి. ఆ పుకార్లేవీ నిజాలు కావు... ఫ‌రవాలేదులే... నేను ఈ వృత్తిలో ఉన్నాను. అక్కడ ప్రజలు నా జీవితం గురించి ఆసక్తిగా ఉంటారు. ఇది నా పనిలో భాగం కాబట్టి నేను అర్థం చేసుకున్నాను... అని అన్నారు. తొలి చిత్రం `పురాణీ జీన్స్ `సహనటుడు తనున్ విర్వాణితో లింక్-అప్ పుకార్లు కూడా ఉన్నాయి.

కానీ వాటిని ఇజ‌బెల్లే ఖండించింది. ``తనుజ్ నా సహనటుడు.. మేము పురాణి జీన్స్ కోసం వర్క్‌షాప్‌లను ప్రారంభించినప్పటి నుండి నిజంగా మంచి స్నేహితులం అయ్యాము. మేం ఎల్లప్పుడూ ఒకరినొకరు కలుస్తాము. అతని తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు. వారు నాకు చాలా మంచి కుటుంబం వంటి వారు. అంతకు మించి ఏదీ లేదు`` అని తెలిపింది.

క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేస్తున్నట్టు ఇజాబెల్లె అంగీకరించింది. నేను ఇండియా వచ్చినప్పుడు నా మొదటి భారతీయ స్నేహితుల్లో విరాట్ ఒకడు. మేము చాలా కాలం పాటు డేటింగ్ చేసాము. దాదాపు రెండేళ్లు కలిసి ఉన్నాం. కానీ మేము దానిని పబ్లిక్ చేయదలచుకోలేదు. కాబట్టి విరాట్ తో నాకు సంబంధం ఉంది. కానీ సిద్ధార్థ్ నాకు స్నేహితుడు మాత్రమే.. మేం కలిసి సమయాన్ని కూడా గడుపుతాము... అని నిజాయితీగా మాట్లాడింది.