Begin typing your search above and press return to search.

తెల్లారి 3.30కు మెగాస్టార్ చేసిన‌ ప‌ని!

ప్ర‌భాస్ కంటే అమితాబ్ పాత్ర‌ గంభీరంగా న‌టించేందుకు స్కోప్ ఎక్కువ క‌నిపించింది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 2:30 AM GMT
తెల్లారి 3.30కు మెగాస్టార్ చేసిన‌ ప‌ని!
X

ఇటీవల విడుదలైన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం 'కల్కి 2898 AD'లో అస‌లైన హీరో ఎవ‌రు? అంటే అమితాబ్ బ‌చ్చ‌న్ అని చెబుతారు. అంత‌గా 81 ఏళ్ల లెజెండ్ త‌న‌ పాత్ర‌లో ఒదిగిపోయి న‌టించాడు. దానికి నాగ్ అశ్విన్ క్యారెక్ట‌ర్ డిజైన్ ఆస్కారం క‌ల్పించింది. ప్ర‌భాస్ కంటే అమితాబ్ పాత్ర‌ గంభీరంగా న‌టించేందుకు స్కోప్ ఎక్కువ క‌నిపించింది. ఈ విజ‌యంతో గ‌ర్వంగా ఉప్పొంగారు అమితాబ్.


80 వ‌య‌సులో ఆయ‌న 20 వ‌య‌సు కుర్రాడిలా ఎన‌ర్జిటిక్ గా క‌నిపించారు. తెర ఆద్యంతం పోరాట దృశ్యాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్ప‌టి శక్తిని, ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారంటే దానివెన‌క ఏదో ర‌హ‌స్యం దాగి ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే 81 ఏళ్ల వ‌య‌సులో పాతిక ప్రాయం యువ‌కులు సైతం చేయ‌లేని విధంగా

సీనియర్ నటుడు తెల్లవారుజామున తన ముఖ్య‌మైన‌ పనిని ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు. మంచం మీద పడకముందే దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలిగాడు.

బిగ్ బి శనివారం తన ఇన్‌స్టాలో ఒక ఫోటోని షేర్ చేసారు. కెమెరా నుండి దూరంగా చూపిస్తూ నవ్వుతూ కనిపించే తన ఫోటోగ్రాఫ్‌ని షేర్ చేసారు. అతడు పైస్లీ డిజైన్‌తో కూడిన బాంబర్ జాకెట్ బ్లాక్ ప్యాంటు ధరించాడు. ''బ్యాక్ ఆఫ్ వర్క్ .. ఇప్పుడు .. ఇది తెల్లవారుజామున‌ 3.30 .. విశ్రాంతి తీసుకునే సమయం అని క్యాప్షన్‌లో రాశాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. బిగ్ బి తన 81 సంవత్సరాల వయస్సులో తమిళ ప‌రిశ్ర‌మ‌లో అరంగేట్రం చేస్తున్నారు. క‌ల్కి త‌ర్వాత ఆయ‌న న‌టిస్తున్న భారీ బ‌హుభాషా చిత్రం `వెట్టయన్`. అమితాబ్ 33 సంవత్సరాల తర్వాత ర‌జ‌నీతో కలిసి న‌టిస్తుండ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'తలైవర్ 170' అని పేరు పెట్టారు.

బిగ్ బి - తలైవర్ ర‌జ‌నీ చివరగా ముకుల్ ఆనంద్ దర్శకత్వం వ‌హించ‌గా, 1991లో విడుదలైన హిందీ చిత్రం 'హమ్'లో కలిసి పనిచేశారు. అప్ప‌ట్లో హమ్ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో గోవింద, అనుపమ్ ఖేర్, కిమీ కట్కర్, దీపా సాహి, శిల్పా శిరోద్కర్, డానీ డెంజొగొప్పా, కాదర్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. అందులోని 'జుమ్మా చుమ్మా దే దే' పాట కూడా గుర్తుండిపోతుంది.

అజేయుడు అమితాబ్:

భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో దాదాపు ఆరు దశాబ్దాల కెరీర్‌ను అజేయంగా విస్తరించిన బిగ్ బి త‌న సీనియర్ రాజేష్ ఖన్నా నుండి స్టార్‌డమ్‌ను వార‌స‌త్వంగా అందిపుచ్చుకుని తర్వాత తన కెరీర్‌లో గరిష్ట స్థాయికి చేరుకున్నారు. ఆ ద‌శ‌లో వరుస బ్లాక్‌బస్టర్‌లను అందించాడు. అయితే, 1990లలో తన నిర్మాణ సంస్థ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ABCL) అప్పుల్లో కూరుకుపోవడంతో తిరోగమనాన్ని చవిచూశారు. బ‌చ్చ‌న్ జీ క్విజ్-ఆధారిత రియాలిటీ టెలివిజన్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'తో తిరిగి పుంజుకున్నాడు. టెలివిజన్ మాధ్యమం ద్వారా హోస్ట్ గా ప్రతి భారతీయ ఇంటిని చేరుకోవడంతో అతడు తిరిగి తన స్టార్‌డమ్‌ను పదిలపరచుకున్నాడు. అమితాబ్ ప్రస్తుతం KBC 16వ సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.