Begin typing your search above and press return to search.

ఫుటేజ్ ట్రైల‌ర్: వ్లాగింగ్ జంట జీవితంలో ప్ర‌వేశించిన షాడో!

ఎడిటర్‌గా పాపుల‌రైన సైజు శ్రీధరన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

By:  Tupaki Desk   |   13 July 2024 5:41 PM GMT
ఫుటేజ్ ట్రైల‌ర్:  వ్లాగింగ్ జంట జీవితంలో ప్ర‌వేశించిన షాడో!
X

మాలీవుడ్ సీనియ‌ర్ న‌టి మంజు వారియ‌ర్ న‌టించిన 'ఫుటేజ్' మూవీ ఆగష్టు 2న థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా ఫుటేజ్ ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. మలయాళంలో రూపొందించిన ఈ సినిమాకి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఇది దొరికిన ఫుటేజ్ ఆధారంగా రూపొందించిన మొద‌టి మాలీవుడ్ చిత్రమ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఎడిటర్‌గా పాపుల‌రైన సైజు శ్రీధరన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ట్రయిలర్ దొరికిన ఫుటేజ్ శైలిలో ప్రదర్శించడం ఉత్కంఠ‌ను క‌లిగించింది. హిందీ సాహిత్యంతో కూడిన అకౌస్టిక్ థీమ్..తో పాటు, ప్రారంభంలో విశాక్ నాయర్ - గాయత్రి అశోక్ పోషించిన స్వేచ్ఛా-స్ఫూర్తితో కూడిన వ్లాగింగ్ జంట న‌ట‌న ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఎంతో రొమాంటిక్ గా సాగే ఈ జంట లైఫ్ లోకి మంజు వారియ‌ర్ పాత్ర ప్ర‌వేశిస్తుంది. మంజు పోషించిన పాత్ర‌లో ర‌హ‌స్యం ఏమిట‌న్న‌ది తెర‌పై చూడాల్సిందే. నాయ‌కానాయిక‌లు ఒక సీక్రెట్ రోల్‌ను ఎదుర్కొన్నప్పుడు క‌థ ఆసక్తికర థ్రిల్లర్‌గా ట‌ర్న్ తీసుకుంది. ట్రైల‌ర్ ముగింపులో ట్విస్ట్ నిజంగా ఆక‌ట్టుకుంది.

ఇది కోవిడ్-19 మహమ్మారి సమయంలో అపార్ట్‌మెంట్ భవనం నేపథ్యంలో సాగే క‌థాంశ‌మిది. దర్శకత్వం ఎడిటింగ్‌తో పాటు ద‌ర్శ‌కుడు సైజు .. షబ్నా మహమ్మద్‌తో కలిసి ఫుటేజ్‌ను కూడా రాసారు. ఈ చిత్రానికి షినోజ్ కెమెరాను ఉపయోగించారు. ఒరిజిన‌ల్ మోషన్ పిక్చర్ సౌండ్‌ట్రాక్ కోసం మేక‌ర్స్ ప్ర‌య‌త్నించారు. రాక్ బ్యాండ్ అస్వీకీప్ టీమ్ దీనికోసం ప‌ని చేసింది. దీనిని రాహుల్ రాజీవ్, సూరజ్ మీనన్ సహ నిర్మాతలుగా, బినీష్ చంద్రన్ - సైజు శ్రీధరన్ నిర్మించారు. ఫుటేజీని ప్రముఖ హిందీ చిత్రనిర్మాత , నటుడు అనురాగ్ కశ్యప్ స‌మ‌ర్ప‌ణ‌లో దీనిని నిర్మించారు.