Begin typing your search above and press return to search.

ఒకే ఎలిమెంట్ మూడు చిత్రాలు.. ఏంటీ కథ?

ఒకే రకమైన కాన్సెప్ట్ తో భిన్నమైన సినిమాలు రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ లో కూడా వెటరన్ కాలం నుంచి ఇలాంటి సందర్భాలు వచ్చాయని చెప్పొచ్చు. ఒకే కథతో ఇద్దరు హీరోలు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నవి ఉన్నాయి.

By:  Tupaki Desk   |   30 July 2023 4:24 AM GMT
ఒకే ఎలిమెంట్ మూడు చిత్రాలు.. ఏంటీ కథ?
X

ఒకే రకమైన కాన్సెప్ట్ తో భిన్నమైన సినిమాలు రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ లో కూడా వెటరన్ కాలం నుంచి ఇలాంటి సందర్భాలు వచ్చాయని చెప్పొచ్చు. ఒకే కథతో ఇద్దరు హీరోలు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నవి ఉన్నాయి. అలాగే ఫెయిల్ అయినవి కూడా. దేవదాసు చిత్రాన్ని తెలుగులో ఏఎన్నార్ తో పాటుగా సూపర్ స్టార్ కృష్ణ కూడా తీశారు. అయితే కృష్ణ తీసిన దేవదాస్ సినిమా డిజాస్టర్ కాగా, నాగేశ్వరరావు దేవదాస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అలాగే జూనియర్ ఎన్ఠీఆర్, కళ్యాణ్ రామ్ టెంపర్, పటాస్ సినిమాలు ఒకే స్టోరీ లైన్ తో వచ్చినవి కావడం విశేషం. రెండింటిలో కూడా హీరో కరప్ట్ అయిన పోలీస్ గానే ఉంటాడు. అలాగే రెండింటిలో కూడా విలన్ తమ్ముడు చేతిలో చనిపోయిన అమ్మాయి కోసమే హీరోలుగా ఫైట్ చేస్తారు. అయితే స్క్రీన్ ప్లే మ్యాజిక్ కారణంగా ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి.

ఈ మధ్యకాలంలో అంటే సుందరానికి, కృష్ణ వృందా విహారి సినిమాలు ఒకే స్టోరీలైన్ తో వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ఏవరేజ్ టాక్తెచ్చుకున్నాయి. ఇప్పుడు అలాగే ఇంచుమించు ఒకే కాన్సెప్ట్ తో మూడు సినిమాలు తెరకెక్కబోతూ ఉన్నాయి. వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్ లో మట్కా టైటిల్ తో సినిమాని ఎనౌన్స్ చేశారు. పీరియాడిక్ జోనర్ లో డబ్బు చుట్టూ అల్లుకున్న కథగానే ఉంది.

అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఎనౌన్స్ అయినా D 51 మూవీ కూడా పీరియాడిక్ జోనర్ లో డబ్బు ప్రధాన అంశంగానే తెరకెక్కించబోతున్నారు. పోస్టర్ లోనే ఈ విషయాన్ని రివీల్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ మూవీ ఎనౌన్స్ అయ్యింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే డబ్బు బ్యాక్ డ్రాప్ గానే ఉందని అర్ధమవుతోంది. పీరియాడిక్ జోనర్లోనే కథ ఉంటుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

ఇలా ఒకే కాన్సెప్ట్ తో ముగ్గురు హీరోలు, మూడు డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఒకేసారి ఎనౌన్స్ కావడం నిజంగా యాదృశ్చికం అని చెప్పాలి. మరి ఈ చిత్రాలలో ఏ మూవీ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుందనేది చూడాలి. డబ్బు బ్యాక్ డ్రాప్ లో వచ్చే కాన్సెప్ట్ లకి మంది డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కి ఈ మూడు సినిమాలు క్యాష్ చేసుకుంటాయా లేదా అనేది ఆసక్తికర అంశంగా మారింది.