Begin typing your search above and press return to search.

సౌత్​ ఇండస్ట్రీకి డిజిటల్ టెన్షన్

సాధారణంగా ఏ బడా సినిమాకు అయినా... ఆ సినిమాకు ఉన్న హైప్​, హీరో మార్కెట్​ ఆధారంగా రిలీజ్​కు ముందే డిజిటల్​ బిజినెస్​ జరిగిపోతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   5 Sep 2023 3:15 AM GMT
సౌత్​ ఇండస్ట్రీకి డిజిటల్ టెన్షన్
X

ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో సౌత్​ మూవీస్​ హవా కొనసాగుతోంది. వరుస పాన్‌ ఇండియా సినిమాలతో సినీ ప్రపంచంలో కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. 'బాహుబలి'తో దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేయగా.. ఇప్పుడు అన్నీ సినిమాలో అవే బాటలో నడుస్తున్నాయి. దీంతో సౌత్ ఇండియా ఇండస్ట్రీ మార్కెట్​ పరిధి పెరిగిన సంగతి తెలిసిందే. అన్నీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిల్లో అదరగొడుతున్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్​ సినిమాలు రేంజ్​ భారీగా పెరిగింది.

అయితే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సినిమాలకు డిజిటల్ షాక్ తగిలినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఏ బడా సినిమాకు అయినా... ఆ సినిమాకు ఉన్న హైప్​, హీరో మార్కెట్​ ఆధారంగా రిలీజ్​కు ముందే డిజిటల్​ బిజినెస్​ జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడా పరిస్థితి కనపడట్లేదు. ప్రభాస సలార్​ రిలీజ్ డేట్​ వాయిదా పడినట్టు రెండు మూడు రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అసలు కారణం డిజిటల్ డీల్​ ఇంకా పూర్తవ్వకపోవడమే కారణమని తెలిసింది. మేకర్స్​ భారీ నెంబర్​ ఫిగర్​​ కోట్​ చేస్తుండగా.. వాటిని కొనుగోలు చేసేందుకు దిగ్గజ డిజిటల్ ఓటీటీ ప్లాట్​ఫామ్​లు ఆలోచిస్తున్నాయట.

ఎందుకంటే అమెజాన్​, నెటిఫ్లిక్స్​ సహా పలు ఓటీటీ సంస్థలు ఇండియన్ మార్కెట్​లో వందల కోట్లకు డిజిటల్ రైట్లు కొనుగోలు చేసి భారీ నష్టాల్ని చూస్తున్నాయని, అందుకే బడ్జెట్ పరిమితులు స్వంతంగా విధించుకుంటున్నాయని ప్రచారం సాగుతోంది. అందుకే అవి నిర్మాతలు కోట్​ చేసే ఫిగర్స్​కు కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదట. ఫలితంగా డిజిటల్ డీల్స్​ ఆలస్యమవ్వడం, సినిమా రిలీజ్ డేట్​లు ఆలస్యమవ్వడం జరుగుతోందని అర్థమవుతోంది.

సలార్ మాత్రమే ఇంకా పలు చిత్రాలు కూడా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిసింది. ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ కల్కి 2898 ఏడీ సినిమాను భారీ బడ్జెట్​లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్​. అయితే ఈ చిత్ర అన్ని భాషల డిజిటల్ రైట్స్​ విక్రయాల ద్వారా పెట్టిన పెట్టుబడిలో 60శాతం రికవరీ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారుట. అలాగే పుష్ప ది రూల్​ మేకర్స్ భారీ మొత్తానికి ఈ డిజిటల్ రైట్స్​ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ ఓజీ డిజిటల్​ రైట్స్​ను కూడా నిర్మాత డీవీవీ దానయ్య పెద్ద నెంబర్​కే కోట్ చేస్తున్నారట. కానీ ఏ డిజిటల్​ ప్లాట్​ఫామ్స్​ కూడా మేకర్స్​ చెబుతున్న ధరకు కొనుగోలు చేసేందుకు రెడీగా లేవట.

ఏది ఏమైనా.. రిలీజ్​కు ముందు డిజిటల్​ రైట్స్​ ద్వారా మంచి ధరకు డీల్ జరిగిపోతే.. సేఫ్ అవ్వొచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. అదే సమయంలో రిజల్ట్​ తేడా కొడితే.. మేకర్స్ చెప్పిన ఎక్కువ ధరకు కొనుగోలు చేసి డిజిటల్​ ఫ్లాట్​ఫామ్స్ నష్టపోతున్నాయని వాదను వినిపిస్తోంది. కాబట్టి ఇరు వర్గాలు ఓ రీజనబుల్​ ప్రైస్​కు డీల్​ సెట్​ చేసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.