కుర్ర హీరోలు ఈ విషయం గుర్తు పెట్టుకోండి..దిల్ రాజ్..
ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన దిల్ రాజ్ కుర్ర హీరోలకు తన అనుభవంతో ఓ సలహాను అందించారు. చిత్ర పరిశ్రమలో ఎవ్వరు కూడా పక్కన వారికి సహాయం చేసే పరిస్థితి లేదని
By: Tupaki Desk | 8 Nov 2024 11:42 AM GMTప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుసు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నానట్టుడు కిరణ్ అబ్బవరం. తాజాగా ‘క’చిత్రంతో పండక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన కిరణ్ రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. అలాగే తాజాగా నిర్వహించిన క మూవీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు నిన్న జితేంద్ర రెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రాకేష్ కూడా సెలబ్రిటీల గురించి మాట్లాడారు. మీడియా అట్రాక్షన్ చిన్న సినిమాల వైపు తిరగాలి అంటే ఈవెంట్లకు పెద్ద సెలబ్రిటీలు రావాలి.. కానీ ఎంత ప్రయత్నించినా సెలబ్రిటీలు మాత్రం దొరకడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు దీని మీద దృష్టి పెట్టడం కంటే కూడా మూవీ ని ఎలా మార్కెటింగ్ చేసుకోవడం బెటర్ నిజానికి డిస్ట్రిబ్యూషన్ ఓ ఎగ్జిబిషన్ లాంటి వ్యవహారం అంటూ అతను మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫైర్ లా స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన దిల్ రాజ్ కుర్ర హీరోలకు తన అనుభవంతో ఓ సలహాను అందించారు. చిత్ర పరిశ్రమలో ఎవ్వరు కూడా పక్కన వారికి సహాయం చేసే పరిస్థితి లేదని.. కాబట్టి ఎవరికి వారు తమని తాము నిరూపించుకోవడం బెటర్ అని చెప్పారు.మొన్న 'క' మూవీ ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు విన్నాను. అలాగే నిన్న ఓ హీరో సెలబ్రిటీలు ఎవ్వరూ తమ చిత్రాలకు సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు అన్న ఆవేదన వ్యక్తం చిత్ర పరిశ్రమలో ఎవరు మీకు సహాయం రారు.. కేవలం మీ టాలెంట్ తో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో మనిషి కంటే కూడా అతని టాలెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి పరిస్థితులు వేరుగా ఉండేవి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నిజాల తోపాటు ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. అటువంటి వారి గురించి అధైర్య పడాల్సిన అవసరం లేదు అన్న దిల్ రాజ్ “కిరణ్ నువ్వెప్పుడూ ఎమోషనల్ కావొద్దు.. నీ సక్సెస్ మాట్లాడాలి. నేను కూడా నీలాగే పల్లెటూరు నుంచి వచ్చి ఈ స్థాయిలో నిలబడ్డాను. ఇక్కడ ఎవరూ మనల్ని సపోర్ట్ చేయరు.. వెనక్కు లాగరు.. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. నువ్వు నీ సినిమాని ప్రేక్షకులలోకి ఎలా తీసుకువెళ్లాలో చూసుకోవడం ముఖ్యం. ఈ విషయాన్ని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ముందుకు సాగితే విజయాన్ని సాధించగలుగుతారు”అని దిల్ రాజు అన్నారు.