Begin typing your search above and press return to search.

TFDC ఛైర్మన్ గా దిల్ రాజు ఆన్ డ్యూటీ

ఈ మేరకు రెండేళ్ల పాటు TFDC ఛైర్మన్ పదవిలో కొనసాగనున్న దిల్ రాజు.. తాజాగా బాధ్యతలు స్వీకరించారు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 7:00 AM GMT
TFDC ఛైర్మన్ గా దిల్ రాజు ఆన్ డ్యూటీ
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా కీలక పదవి అప్పగించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్‌ డెవల్ప్మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండేళ్ల పాటు TFDC ఛైర్మన్ పదవిలో కొనసాగనున్న దిల్ రాజు.. తాజాగా బాధ్యతలు స్వీకరించారు.


బుధవారం ఉదయం తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం TFDC ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు బాధ్యతలు స్వీకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


దీంతో సెలబ్రిటీలు, నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు. దిల్ రాజుకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. TFDC ఛైర్మన్ గా దిల్ రాజును రేవంత్ రెడ్డి నియమించడం వల్ల సినీ ఇండస్ట్రీకి మరింత మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దిల్‌ రాజు థ్యాంక్స్ చెప్పారు.

ఇక దిల్ రాజు విషయానికొస్తే.. ఆయన అసలు పేరు వెంకట రమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి మూవీతో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 34 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 2003లో దిల్ సినిమాను నిర్మించి.. డెబ్యూతో ప్రొడ్యూసర్ గా మంచి హిట్ అందుకున్నారు.

ఆ తర్వాత నుంచి ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. టాలీవుడ్ లో ఒక బ్రాండ్ గా ఎదిగారు. అనేక బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. బడా చిత్రాలను నిర్మించారు. ఇప్పటికీ నిర్మిస్తున్నారు. అటు డిస్ట్రిబ్యూషన్ లో.. ఇటు ప్రొడక్షన్ లో తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. రెండు సెక్టార్లలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

ఇప్పుడు సంక్రాంతికి రెండు భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స్టార్ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ను ఆయనే నిర్మిస్తున్నారు. సీనియర్ వెంకటేష్, అనిల్ రావిపూడి సంక్రాంతి వస్తున్నాం మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీటితోపాటు నితిన్ తమ్ముడు సహా పలు సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పుడు TFDC ఛైర్మన్ గా సేవలు అందించనున్నారు.