Begin typing your search above and press return to search.

100 కోట్ల నష్టం.. రెండు వారాల్లో రికవరీ!

ఇక ఇన్నేళ్ళ కెరీర్ లో ఇటీవల నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ ఫ్లాప్‌తో ఓ పెద్ద షాక్‌కు గురయ్యారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 11:27 AM GMT
100 కోట్ల నష్టం.. రెండు వారాల్లో రికవరీ!
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెరీర్ మొదట్లో కొత్త దర్శకులతోనే ఎక్కువగా డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేశాడు. ఇక అతనికి ఎక్కువగా లాభాలు ఇచ్చింది చిన్న సినిమాలే. బొమ్మరిల్లు ఆల్ టైమ్ బెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా. ఆ తరువాత శతమానం భవతి, బలగం, F2 ఇలా చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలే కాసుల వర్షం కురిపించాయి. ఇక పెద్ద సినిమాలు మాత్రం ఆయనకు పెట్టిన పెట్టుబడికి మాత్రం పెద్దగా లాభాలు అందించ లేదు.

ఇక ఇన్నేళ్ళ కెరీర్ లో ఇటీవల నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ ఫ్లాప్‌తో ఓ పెద్ద షాక్‌కు గురయ్యారు. మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం, థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోవడంతో దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైనే నష్టాలను ఎదుర్కొంది. అయితే, ఇదే సమయంలో దిల్ రాజు మరో రిస్క్ చేయడం బాగా కలిసొచ్చింది. ఇదే బ్యానర్‌లో మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం మాత్రం భారీ సక్సెస్‌గా నిలిచింది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ నేపథ్యంలో విడుదలై, ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందనను అందుకుంది. పండుగ వాతావరణానికి అనుగుణంగా వినోదం, కుటుంబ భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

ఫలితంగా ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌లో రూ.100 కోట్లకు పైగా లాభాలను అందించి, గేమ్ చేంజర్ కోసం భారీ బడ్జెట్‌ పెట్టుబడులు పెట్టడం, అంతకు మించి మార్కెటింగ్ వ్యయాలు చేసినా, ఆ పెట్టుబడులకు తగిన ఫలితం రాలేదు. సినిమాలో నెరేషన్, కంటెంట్‌పై ఆడియెన్స్ నుంచి ఎక్కువగా విమర్శలు రావడం ఈ ఫలితానికి కారణమయ్యింది.

మరోవైపు, సంక్రాంతికి వస్తున్నాం వంటి వినోదాత్మక, కుటుంబ కథాచిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతమైంది. దిల్ రాజు ఇప్పటివరకు తన కెరీర్‌లో చాలా విజయాలు అందుకున్న నిర్మాత. అయితే గేమ్ చేంజర్ వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్‌బస్టర్‌తో నష్టాలను బ్యాలెన్స్ చేయగలగడం అతని సత్తాను మరోసారి రుజువు చేసింది.

గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రావడం వల్లే ఇంకా ఎక్కువ స్థాయిలో నష్టాలు రాలేదు. అలాగే దీని కారణంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను వాయిదా వేయాకపోవడం అసలైన గేమ్. పక్కా పొంగల్ సినిమా కాబట్టి ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఏదేమైనా దిల్ రాజు చేసిన రిస్క్ తో వారంలో పోయిన వంద కోట్లు రెండు వారాల్లో వచ్చేశాయి.