Begin typing your search above and press return to search.

డిన్న‌ర్ల‌కు వెళ్తూ డిస్క‌స్ చేసి సెట్ అయ్యారు!

విక్ట‌రీ వెంక‌టేష్‌-సూపర్ స్టార్ మ‌హేష్ `సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో ద‌శాబ్ధం క్రితం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు పునాది వేసిన సంగ‌త తెలిసిందే

By:  Tupaki Desk   |   5 March 2025 7:00 PM IST
డిన్న‌ర్ల‌కు వెళ్తూ డిస్క‌స్ చేసి సెట్ అయ్యారు!
X

విక్ట‌రీ వెంక‌టేష్‌-సూపర్ స్టార్ మ‌హేష్ `సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో ద‌శాబ్ధం క్రితం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు పునాది వేసిన సంగ‌త తెలిసిందే. ఎన్టీఆర్..ఏఎన్నార్...కృష్ణ ..చిరంజీవి జ‌న‌రేష‌న్ త‌ర్వాత మ‌ల్టీస్టారర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ అందుకు ఆజ్యం పోసింది వెంక‌టేష్‌-మ‌హేష్‌- శ్రీకాంత్ అడ్డ‌ల తాయ‌మే. అప్ప‌ట్లో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` మంచి విజయం సాధించింది.

దీంతో మిగ‌తా హీరోలు కూడా మ‌ల్టీస్టార‌ర్స్ పై ఆస‌క్తి చూపించ‌డం మొద‌లు పెట్టారు. ఇప్పుడా ఫ్యాష‌న్ ఏకంగా పాన్ ఇండియాకే తాకింది. మ‌రి వెంకీ-మహేష్ ల‌ను అప్ప‌ట్లో ఎలా ఒప్పించార‌ని సీత‌మ్మ రీ-రిలీజ్ సంద‌ర్భంగా దిల్ రాజు ని అడిగితే ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు.` శ్రీకాంత్ ఈ ఐడియాతో నా ముందుకొచ్చిన త‌ర్వాత ఆస‌క్తిగా అనిపించింది. ముందుగా వెంక‌టేష్ ని ఒప్పించాం.

ఆ త‌ర్వాత మ‌హేష్ ని సంప్ర‌దించాం. కానీ అనుకున్న విధంగా తెర మీద‌కు తేవ‌డాన‌కి ఏడాది స‌మ‌యం ప‌ట్టింది. క‌థ అనుకున్న‌ప్పుడు వారిద్ద‌రికే సెట్ అవుతుంద‌నుకున్నాం. అనుకున్న త‌ర్వాత వారిద్ద‌రు క‌లిసి వ‌ర్క్ చేసారు. ఖాళీ స‌మ‌యాల్లో ఇద్ద‌రుక‌లిసి డిన్న‌ర్ల‌కు వెళ్లేవారు. ఎలా వ‌ర్క్ చేయాలి? అన్న దానిపై క‌లిసి డిస్క‌స్ చేసుకునేవారు. స్క్రీన్ పై వారిద్ద‌ర్నీ చూస్తే స‌హ‌జంగా అనిపిస్తుంది.

అలాంటి కాంబినేష‌న్ మ‌రో జోడీతో అయితే అంత గొప్ప‌గా వ‌చ్చేది కాదేమో అనిపిస్తుంది` అన్నారు. అలాగే ఈ సినిమా సీక్వెల్ ఆలోచ‌న లేదా? అంటే ఆ ఛాయిస్ నీకే ఇస్తున్నానంటూ ఓ పాత్రికేయుడికే వ‌దిలేసారు. సినిమా చూసిన త‌ర్వాత సీక్వెల్ ఎలా చేస్తే బాగుంటుందో చెబితే? ఓ ఐడియా ఇవ్వు. నిర్మించ‌డానికి సిద్దంగా నేను ఉంటాను` అన్నారు.