ట్రోలింగ్ తో సినిమాని నాశనం చేస్తున్నారు! దిల్ రాజు
దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ వాకిట్లోసిరిమల్లె చెట్టు` సినిమా మార్చి 7న మళ్లీ రీ-రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 March 2025 9:00 PM ISTదిల్ రాజు నిర్మించిన `సీతమ్మ వాకిట్లోసిరిమల్లె చెట్టు` సినిమా మార్చి 7న మళ్లీ రీ-రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. నిర్మాతకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. అప్పట్లో ఓటీటీ లేదు కాబట్టి థియేట్రికల్ తో పాటు భారీ ధరకు శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయి. టీవీ రిలీజ్ లోనూ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు.
రీ-రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మీ సినిమా రీ-రిలీజ్ వల్ల ఆరోజు రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు ఇబ్బంది ఏర్పడుతుంది కదా? అంటే రాజుగారు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు మళ్లీ థియేటర్లో ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుం టున్నారు కాబట్టేరిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు కోరుకునేది మాత్రమే మనం ఇవ్వాలి.
వాళ్లు కోరుకోకుండా ఎంత పెద్ద సినిమా ఇచ్చినా మార్నింగ్ షోకే బై బై చెప్పేస్తున్నారు. దానికి తోడు సోషల్ మీడియా ట్రోలింగ్ మరో స్థాయిలో జరుగుతోంది. ఒక సినిమాని నాశనం చేసే వరకూ వదలడం లేదు. ప్రేక్షకులు సిద్దంగా ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయోద్దు ఈసినిమానే చూడండి అంటే చూస్తారా? చూడరు. ఇంట్లోనే కూర్చుంటారు. వాళ్లంతా క్లారిటీగా ఉన్నారు. టీజర్, ట్రైలర్ తోనే చూడాలా? వద్దా? అన్నది డిసైడ్ అయిపోతున్నారు` అని అన్నారు.
అయితే రాజుగారు ట్రోలింగ్ అంశం గురించి తెరపైకి తెచ్చింది `గేమ్ ఛేంజర్` గురించేనని నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఆయన నిర్మించిన `గేమ్ ఛేంజర్` సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా విమర్శలకు, ట్రోలింగ్ లకు గురైంది. భారీ వ్యయంతో నిర్మించిన సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి.