Begin typing your search above and press return to search.

రాజుగారి న్యూ మల్టీస్టారర్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు!

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఎదిగిన దిల్ రాజు, ఎప్పటికప్పుడు తన కథా ఎంపికలతో కొత్తదనం తీసుకువస్తుంటారు.

By:  Tupaki Desk   |   20 March 2025 5:56 PM IST
రాజుగారి న్యూ మల్టీస్టారర్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు!
X

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఎదిగిన దిల్ రాజు, ఎప్పటికప్పుడు తన కథా ఎంపికలతో కొత్తదనం తీసుకువస్తుంటారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ నుంచి మాస్ యాక్షన్ సినిమాల వరకు విభిన్నమైన ప్రాజెక్టులను నిర్మించి, టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు. ఆయన బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాల్లో చాలా వరకూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. కేవలం కంటెంట్ పరంగా కాకుండా, టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో సినిమాలను నిర్మించడం దిల్ రాజు స్పెషాలిటీ.

ఇప్పుడు, తన బ్యానర్ నుంచి మరో పాన్ ఇండియా మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ దర్శకుడు హనీఫ్ అదేని దర్శకత్వం వహించబోతున్నారని అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే 'మార్కో' అనే చిత్రంతో భారీ హిట్ అందుకున్న హనీఫ్, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించడంలో మంచి దర్శకుడు అని నిరూపింసీగుకున్నాడు.

హై వయొలెన్స్, గ్రిప్పింగ్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం అతను తెలుగులో తన మొదటి పాన్ ఇండియా సినిమాను చేయబోతుండటంతో, టాలీవుడ్ ఆడియన్స్‌లో కూడా పెద్ద ఆసక్తి నెలకొంది. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్, హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దిల్ రాజు ఫ్యామిలీ డ్రామా, మ్యూజికల్ ఎంటర్‌టైనర్ తరహా సినిమాలు ఎక్కువగా నిర్మించారు.

కానీ ఈ సారి టోటల్‌గా కొత్త జోనర్‌ను ట్రై చేస్తున్నారు. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ వంటి ఫీల్-గుడ్ మల్టీస్టారర్ హిట్ అయిన తరువాత, F2 ఫ్రాంచైజ్ కామెడీ సినిమాలు వెంకీ వరుణ్ తో చేశారు. ఇక మళ్ళీ ఇన్నాళ్ళకు దిల్ రాజు తన బ్యానర్‌లో బిగ్ మల్టీస్టారర్ చేయబోతున్నారు. కానీ ఈ సారి పూర్తిగా మాస్, యాక్షన్ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. భారీ యాక్షన్ బ్లాక్స్, మైండ్ గేమ్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది.

ఇంకా టైటిల్ కూడా ఖరారు కాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన మరో అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. గురు ఫిల్మ్స్‌కు చెందిన సునీతా తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండనున్నారు. తక్కువ టైమ్‌లోనే హనీఫ్ అదేని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మార్కో’ సినిమా తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నా, ఆయన తెలుగులో మొదటి సినిమా చేయాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. మరి, ఈ మల్టీస్టారర్ సినిమాలో ఎవరు నటించబోతున్నారన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ భారీ స్టార్ కాస్ట్ ఉంటే, తెలుగు సినిమాల్లో మరో బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి తెరలేచినట్లే.

సినిమా స్కెయిల్, బ్యానర్ గ్రాండ్‌నెస్, దర్శకుడి టాలెంట్ చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో దుమ్ముదులిపేలా ఉంది. ఇప్పటివరకు దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన సినిమాల కంటే ఇది హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు మాత్రమే కాదు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లోనూ ఈ సినిమాను భారీ లెవెల్‌లో ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి, దిల్ రాజు మరోసారి తన మార్క్ చూపించబోతున్నాడు. సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనేది త్వరలోనే వెల్లడవనుంది.