శంకర్ స్ట్రోక్ ఇచ్చినా తగ్గని దిల్ రాజు.. మరో బిగ్ కాంబో?
అయితే శంకర్ ఇచ్చిన స్ట్రోక్ వలన రాజుగారు బడా దర్శకులతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయకపోవచ్చు అనేలా టాక్ వచ్చింది.
By: Tupaki Desk | 31 Jan 2025 10:30 AM GMTటాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు, మళ్ళీ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. గేమ్ చేంజర్ ఫలితంతో ఒకేసారి వంద కోట్ల రేంజ్ లో నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం అద్భుత విజయాన్ని అందుకొని ఆ నష్టాలను రికవరీ చేశారు. ఈ సంక్రాంతి సమయంలో ఆయన పెద్దగా నష్టపోయింది లేదు అలాగే లాభం కూడా రాలేదు. అయితే శంకర్ ఇచ్చిన స్ట్రోక్ వలన రాజుగారు బడా దర్శకులతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయకపోవచ్చు అనేలా టాక్ వచ్చింది.
కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. గతంలోనే కొంతమంది అగ్ర దర్శకులతో దిల్ రాజు దీలింగ్స్ సెట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మరిన్ని బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు అందరూ ఇప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, తన బ్యానర్లో భారీ సినిమాలను లైన్లో పెట్టడానికి ఆయన కష్టపడుతున్నారు.
ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి దిల్ రాజుతో కలిసి చాలా సినిమాలు చేశారు. కానీ, ఇప్పుడు ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి కాస్త బ్రేక్ ఇచ్చి బయటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి నిర్మించనుండటంతో, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి అనిల్ రావిపూడి దూరమవుతున్నట్లే.
దీంతో, ఆయన తన బ్యానర్ కోసం కొత్త క్రేజీ ప్రాజెక్ట్‌లను సెట్ చేసుకోవాలని చూస్తున్నారు. దిల్ రాజుకు టాలీవుడ్లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లోనూ గట్టి నెట్వర్క్ ఉంది. ముఖ్యంగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఆయన సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ కలిసి ఓ భారీ సినిమాను ప్లాన్ చేయాలని చర్చలు జరుపుతున్నారు.
కానీ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2, ఎన్టీఆర్ 31 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ దర్శకుడిని దిల్ రాజు ఎలాగైనా తన బ్యానర్లో సినిమా చేయించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఖాళీ కాకపోయినా, 2027లో వీరిద్దరి కాంబోలో సినిమా మొదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు, ఈ సినిమాకు సంబంధించిన హీరో ఎంపికపై కూడా ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా అనగానే, ఇది పాన్ ఇండియా రేంజ్లో ఉండే సినిమా అనే అర్థం. అందువల్ల, ఈ ప్రాజెక్ట్‌కు టాప్ హీరోని ఫైనల్ చేయడానికి భారీ కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు చేతిలో పెద్ద డైరెక్టర్లతో కన్ఫర్మ్ అయిన సినిమాలు ఏవీ లేవు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లు అందరూ ఇప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కానీ, దిల్ రాజు మాత్రం ఎలాగైనా ప్రశాంత్ నీల్‌ను తన బ్యానర్లో సినిమా చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. వారిద్దరి మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ హై రేంజ్ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.