పృథ్వీరాజ్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
మార్చి 27న ఎల్2 ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
By: Tupaki Desk | 22 March 2025 4:54 PM ISTగేమ్ ఛేంజర్ సినిమాతో ఈ ఏడాది మొదట్లోనే డిజాస్టర్ అందుకున్న దిల్ రాజు కు ఆ తర్వాత వరుస విజయాలు దక్కాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటూ ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన పలు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచి అతనికి కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు దిల్ రాజు తాజాగా ఎల్2: ఎంపురాన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
లాస్ట్ మినిట్ లో అడిగినా వెంటనే రెస్పాండ్ అయి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి దిల్ రాజు ముందుకొచ్చారని డైరెక్టర్ పృథ్వీరాజ్ చెప్తున్నదాన్ని బట్టి చూస్తుంటే ఎల్2 కంటెంట్ పై దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థమవుతుంది. మార్చి 27న ఎల్2 ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ ప్రెస్ మీట్ దిల్ రాజు, మోహన్ లాల్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు. మనల్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ సరసన ఎల్2 సినిమాతో పృథ్వీరాజ్ కూడా చేరతారని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు అన్న మాటలకు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. దిల్ రాజు ఈ రేంజ్ కామెంట్స్ చేయడం చూసి మీడియా సైతం అవాక్కైంది.
ఇదిలా ఉంటే మార్చి 27,28 తేదీల్లో టాలీవుడ్ లో పలు సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోటీ ఎలా ఉంటుందని భావిస్తున్నారనే ప్రశ్నకు దిల్ రాజు అన్నీ పెద్ద బ్యానర్ల సినిమాలే ఉన్నాయని, ఎవరి మూవీని ఎలా రిలీజ్ చేసుకోవాలో వారికి బాగా తెలుసని, ఎవరి స్ట్రాటజీలు వారికున్నాయని ఆయన అన్నారు.
డైరెక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ అప్పుడు లూసిఫర్ ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయలేకపోయామని, ఇప్పుడు ఎల్2 తెలుగు వెర్షన్ కోసం చాలా కష్టపడ్డామని, టికెట్ బుకింగ్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి షాకవుతున్నామని అన్నారు. ఎల్2 కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మూడో పార్ట్ ను దిల్ రాజు గారితో తీసేలా ఉన్నానని, తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ చాలా స్పెషల్ అని పృథ్వీరాజ్ అన్నారు.