Begin typing your search above and press return to search.

కొడుతున్నాం.. కొడుతున్నాం.. గట్టిగా కొడుతున్నాం..!

ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఈమధ్య జరుగుతున్న విషయాలను ప్రతిభింభిస్తాయని అన్నారు దిల్ రాజు.

By:  Tupaki Desk   |   29 Dec 2024 9:14 AM GMT
కొడుతున్నాం.. కొడుతున్నాం.. గట్టిగా కొడుతున్నాం..!
X

గ్లోబల్ స్టార్ రాం చరణ్, కియరా అద్వాని జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ఇప్పటికే మూవీపై భారీ క్రేజ్ తెచ్చాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో జరిగింది. మెగా ఫ్యాన్స్ హంగామా తో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఈ ఈవెంట్ లో దిల్ రాజు స్పీచ్ మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఆయన ఎనర్జీ స్పీచ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. చిరంజీవి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేశాం కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎంజాయ్ చేశా.. ఇప్పుడు చరణ్ తో సినిమాలు నిర్మిస్తూ ఎంజాయ్ చేస్తున్నా అని అన్నారు దిల్ రాజు. ఎవడు చేశాం మళ్లీ 11 ఏళ్లకు గేం ఛేంజర్ వస్తుందని అన్నారు. మెగా ఫ్యామిలీతో తన బాండింగ్ కొనసాగుతుందని అన్నారు దిల్ రాజు.

శంకర్ గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశా.. ఆయన నిర్మించిన సినిమా తెలుగు రిలీజ్ చేశా.. ఆయన తో కలిసి సినిమా చూసి చాలా సంతోషపడ్డానని అన్నారు. శంకర్ గారితో భారీ బడ్జెట్ సినిమా చేయాలని అనుకున్నా.. గేమ్ ఛేంజర్ తో అది కుదిరింది. ఈ సినిమాలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈమధ్య జరిగిన కొన్ని విషయాలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఈమధ్య జరుగుతున్న విషయాలను ప్రతిభింభిస్తాయని అన్నారు దిల్ రాజు.

సంక్రాంతికి వస్తున్నాం.. కొడుతున్నాం.. కొడుతున్నాం.. గట్టిగా కొడుతున్నామని అన్నారు. RRR తర్వాత శంకర్ డైరెక్షన్ లో చరణ్ సినిమా చేయడం విశేషమని.. ఈ సినిమా తప్పకుండా అందరి అంచనాలకు తగినట్టు ఉంటుందని అన్నారు. మీ ఎనర్జీని ఇలానే ఉంచుకుని సంక్రాంతికి సినిమా రిలీజ్ రోజు చూపించండని అన్నారు దిల్ రాజు. శంకర్ గారు సాంగ్స్ లో కూడా ఆయన మార్క్ చూపించారని అన్నారు.

ఇక ఆయన విజయ్ వారిసు టైం లో చెప్పిన ఫైట్స్ వెనుమా.. ఫైట్స్ ఇరుక్కు.. సాంగ్స్ వెనుమా సాంగ్స్ ఇరుక్కు.. అంటూ అదే డైలాగ్ రిపీట్ చేసి ఫ్యాన్స్ లో హుశారు నింపారు.