Begin typing your search above and press return to search.

ఎంతో బాధ్యత ఉంది.. అలా పనిచేస్తా!

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఇప్పుడు తనపై ఎంతో బాధ్యత ఉందని దిల్ రాజు తెలిపారు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 11:00 AM GMT
ఎంతో బాధ్యత ఉంది.. అలా పనిచేస్తా!
X

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్ డీసీ) ఛైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నియమితులైన విషయం తెలిసిందే. ఇటీవల సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేయగా.. తాజాగా దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. టీఎఫ్‌ డీసీ ఛైర్మన్‌ గా బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

కుటుంబసభ్యులతో కలిసి ఛాంబర్ కు వచ్చిన దిల్ రాజు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీఎఫ్ డీసీ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెంకట్ రెడ్డికి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఇప్పుడు తనపై ఎంతో బాధ్యత ఉందని దిల్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య ఒక వారధిలా పనిచేస్తానని చెప్పారు. ఇండస్ట్రీలోని అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని వెల్లడించారు. టీఎఫ్‌ డీసీకి పూర్వవైభవం తీసుకురావాలని అన్నారు.

అందుకోసం అందరి సహకారం అవసరముందని దిల్ రాజు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర సంస్కృతి బ్యాక్ డ్రాప్ తో సినిమాలు తెరకెక్కేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు.

టీఎఫ్ డీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు.. దిల్ రాజుకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఇండస్ట్రీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుతున్నారు. పరిశ్రమకు మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

అదే సమయంలో దిల్ రాజు పుట్టిన రోజు కూడా నేడు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. నెటిజన్లు, అభిమానులు.. స్పెషల్ విషెస్ చెబుతున్నారు. మరిన్ని మంచి సినిమాలను తీసుకురావాలని కోరుతున్నారు. మరి దిల్ రాజు.. ఫ్యూచర్ లో ఎలాంటి చిత్రాలను రూపొందిస్తారో వేచి చూడాలి.