ప్రభుత్వమా.. అల్లు అర్జునా కాదు.. .. ఆ ఫ్యామిలీ బాధ్యత నాది : దిల్ రాజు
భాస్కర్ కి ఇండస్ట్రీ నుంచే కాదు ప్రభుత్వం తరపు నుంచి సహకారం ఉంటుంది. నా ద్వారా నిలబడి ఆ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటామని అన్నారు దిల్ రాజు.
By: Tupaki Desk | 24 Dec 2024 12:04 PM GMTపుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన ఘటన రకరకాల టర్న్ లు తీసుకుంటుందని తెలిసిందే. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడటంతో విషయం మరింత సీరియస్ కాగా ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్, సీపీ ఆనంద్ వివరణ ఇవన్నీ ఇష్యూని చాలా సీరియస్ అయ్యేలా చేశాయి. ఐతే ఈ టైం లో ఈ ఇష్యూకి ఒక పరిష్కారం చూపించేలా టి.ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారు. ఆయన ఈమధ్య అందుబాటులో లేకపోవడంతో ఆయన తిరిగి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టారు.
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని చూసేందుకు వెళ్లిన దిల్ రాజు. వచ్చీరాగానే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించామని అన్నారు. అటు సినీ పరిశ్రమకు ఇటు ప్రభుత్వానికి ఎఫ్.డి.సి చైర్మన్ గా తానొక బ్రిడ్జ్ గా ఉంటానని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం.. పోలీసుల విచారణ చట్టప్రకారం కొనసాగుతుంది. సీఎం తో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం, ఇండస్ట్రీ కాదు ముందు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు దిల్ రాజు.
భాస్కర్ కి ఇండస్ట్రీ నుంచే కాదు ప్రభుత్వం తరపు నుంచి సహకారం ఉంటుంది. నా ద్వారా నిలబడి ఆ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటామని అన్నారు దిల్ రాజు. శ్రీ తేజ్ చిన్నగా కోలుకుంటున్నాడు. చిన్న వయసు కాబట్టి ట్రీట్ మెంట్ కి మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు. శ్రీ తేజ్ తో పాటు ఒక పాప కూడా ఉంది. భాస్కర్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఒక పర్మినెంట్ జాబ్ ఇస్తామని అన్నారు దిల్ రాజు. శ్రీ తేజ్, ఇంకా ఆ డాటర్ బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు.
ఈ ఇష్యూలో ప్రభుత్వం ఇండస్ట్రీని దూరం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి ఏం కావాలన్నా ఎఫ్.డి.సి చైర్మన్ గా ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య ఈ సమస్య త్వరలోనే పరిష్కారం వచ్చేలా చూస్తామన్నారు దిల్ రాజు.
ఇక్కడ ప్రభుత్వమా.. అల్లు అర్జునా కాదు.. భాస్కర్ ఫ్యామిలీకి న్యాయం చేయాలి. ఆయనకు సపోర్ట్ గా నిలబడాలని అన్నారు దిల్ రాజు. వాళ్లని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదని అన్నారు. ఇలాంటివి ఎవరు కావాలని చేయరని అన్నారు దిల్ రాజు. నా డ్యూటీ నేను చేస్తున్నా త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దిల్ రాజు.