దిల్ రాజుకి కోపం వచ్చిందా..?
టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ప్రస్తుతం అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.
By: Tupaki Desk | 18 March 2025 5:00 AM ISTటాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ప్రస్తుతం అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. నిర్మాణ పరంగా ఎన్నో విజయాలు అందించినప్పటికీ, ఇటీవల వచ్చిన ఫ్లాపులు, వ్యక్తిగత విషయాలపై వచ్చిన వార్తలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ రెయిడ్స్ తో కూడా కాస్త డిస్టర్బ్ అయ్యారు. అయితే ఇటీవల ఓ ప్రముఖ వెబ్ పోర్టల్ గురించి ఒక సెన్సిటివ్ కథనాన్ని ప్రచురించడంతో, రాజుగారికి కోపం వచ్చినట్లు తెలుస్తోంది.
సాధారణంగా రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా దిల్ రాజు పెద్దగా పట్టించుకోరు. అయితే లిమిట్స్ దాటితే మాత్రం ఆయన వెంటనే కౌంటర్ ఇచ్చే వ్యక్తి కూడా. కొన్నిసార్లు బహిరంగంగానే హెచ్చరికలు కూడా చేశారు. ఇక ఇటీవల 'గేమ్ ఛేంజర్' చిత్రం పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కొంది. సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ కావడం వల్ల ఆయన ఆ నష్టాల నుంచి బయటపడ్డారు.
ఈ నేపథ్యంలోనే, రాజుగారి ప్రైవేట్ లైఫ్ గురించి, పేమెంట్స్ గురించి పలు ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఒక వెబ్ పోర్టల్ ఆర్టికల్ ను ఘాటుగా రాయడం ఆయనకు అస్సలు నచ్చలేదట. దీనిపై అతను వెంటనే స్పందించి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సదరు వెబ్ పోర్టల్ ఆ కథనాన్ని తీసేసింది. ఇక మళ్ళీ ఏమైందో, అనూహ్యంగా ప్రెస్‌మీట్ కూడా రద్దవ్వడం, ఈ వ్యవహారం మరింత మిస్టీరియస్‌గా మారింది.
దిల్ రాజు తన వ్యక్తిగత విషయాల్ని బయట పెట్టకూడదనే విధంగా చాలా జాగ్రత్తలు పాటించే వ్యక్తి. అలాంటిది ఈ స్థాయిలో ఆరోపణలు రావడం, ఫైనాన్షియల్ డీటైల్స్ లీక్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో ఆయన గుర్రుగా ఉన్నట్లు టాక్. గతంలో కలిసి పనిచేసిన కొందరే ఈ లీకులకు కారణమని అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇలాంటి సమయంలో, దిల్ రాజు ఏమాత్రం తగ్గకుండా తన ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిన తరువాత మళ్ళీ పెద్ద సినిమాలు చేయరేమో అనేలా కామెంట్స్ వచ్చాయి. కానీ నెక్స్ట్ ఆయన ప్రభాస్ తో కలిసి ఓ భారీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే విధంగా యంగ్ హీరోలతో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు లేనిపోని కథనాలతో ఈ లీక్స్ వెనుక అసలు సూత్రధారి ఎవరు ఇది కావాలనే జరిగిందా అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. మరి భవిష్యత్తులో రాజుగారు దీనిపై ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదంటే ఇంతటితో వదిలేస్తారా అన్నది చూడాలి.