Begin typing your search above and press return to search.

హోట‌ల్ రూమ్‌లో శ‌వ‌మై క‌నిపించిన న‌టుడు!

అతడు `పంచాగ్ని` అనే టెలివిజన్ సీరియల్ షూటింగ్ చేస్తున్నాడు. దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిలోనే చనిపోయి ఉన్నట్లు గుర్తించారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:25 AM GMT
హోట‌ల్ రూమ్‌లో శ‌వ‌మై క‌నిపించిన న‌టుడు!
X

క‌ళారంగంలో ఒడిదుడుకులు ఆర్టిస్టుల పాలిట శాపం అవుతున్నాయి. ఆర్థిక కార‌ణాలు కొన్నిసార్లు చావుల‌కు కార‌ణ‌మైతే, ఇత‌ర కుటుంబ స‌మ‌స్య‌లు కూడా ఆత్మ‌హ‌త్య‌లకు దారి తీస్తున్నాయి. తాజా మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు దిలీప్ శంకర్ తిరువనంతపురంలోని వాన్‌రోస్ జంక్షన్ సమీపంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. అత‌డు డిసెంబర్ 19న హోటల్‌లోకి దిగాడు. గత కొన్ని రోజులుగా రూమ్‌లో ఉన్నాడు. అతడు `పంచాగ్ని` అనే టెలివిజన్ సీరియల్ షూటింగ్ చేస్తున్నాడు. దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిలోనే చనిపోయి ఉన్నట్లు గుర్తించారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గ‌ది నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతడి సహనటులు అక్క‌డికి చేరుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించినట్లు సమాచారం. మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పోలీసుల వివ‌రాల‌ ప్ర‌కారం...ఈ దశలో ఇది ఆత్మ‌హ‌త్య‌నా? హ‌త్యా? అనే దానిపై ఫౌల్ ప్లే సంకేతాలు లేవు. మరణానికి క‌చ్చితమైన కారణం పోస్ట్‌మార్టం తర్వాత నిర్ధారించ‌నున్నారు. దిలీప్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స పొందుతున్నారని షో డైరెక్టర్ మనోరమ వెల్లడించారు. షూటింగ్ మధ్యలో రెండు రోజుల విరామం ఉంది.. కానీ అత‌డు సెట్స్ కి రాలేద‌ని తెలిపారు.

దిలీప్ శంకర్ హఠాన్మరణం మ‌ల‌యాళ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. నటి సీమా జి నాయర్ సోషల్ మీడియాలో సంతాపం తెలియ‌జేసారు. ఐదు రోజుల క్రితం నాకు ఫోన్ చేసారు దిలీప్. ఆ రోజు నాకు తలనొప్పి రావడంతో మాట్లాడలేకపోయానని తెలిపారు. సోషల్ మీడియాలో అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.