నిజం నిప్పు అదెప్పటికైనా బయటకి!
గుర్తు పెట్టుకో... చరిత్ర గర్భంలో నిజం గెలిచింది గానీ...అబద్దం కాదు. జ్ఞాపకాలు చెరిపేసినంత మాత్రాన నిజం చెరిగిపోదు అంటూ మాజీ భర్తపై అవేదన చెందింది దిల్జీత్ కౌర్.
By: Tupaki Desk | 9 Jun 2024 7:40 AM GMTనిజం నిప్పులాంటింది. అది ఎప్పటికైనా బయటకొస్తుంది. అరోజు ఎందుకు ఆ తప్పు చేసామా? అని బాధపడే రోజు ఒకటుంటుంది. నిజం మీద అబద్దం ఎంతో కాలం నిలువదు. నిజానికి..నీజాయితీకి ఉన్న విలువ అలాంటింది. అవును ఇది చరిత్ర చెప్పిన సత్యం. 'నా జీవితంలో చోటు చేసుకున్న ఆ నిజం నేనిప్పుడు చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. కానీ ఆ నిజం నమ్మే రోజు అనేది ఒకటుంటుంది? అ రోజు తప్పు చేసాను అని కచ్చితంగా బాధపడతావ్.
గుర్తు పెట్టుకో... చరిత్ర గర్భంలో నిజం గెలిచింది గానీ...అబద్దం కాదు. జ్ఞాపకాలు చెరిపేసినంత మాత్రాన నిజం చెరిగిపోదు అంటూ మాజీ భర్తపై అవేదన చెందింది దిల్జీత్ కౌర్. ఇటీవలే బాలీవుడ్ జోడీ నిఖిల్ పటేల్-దిల్జీద్ కౌర్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ స్టోరీ ద్వారా నిఖిల్ ఓ పోస్ట్ షేర్ చేసాడు. గతలంలో దిల్జీత్ వేసిన పెయింటింగ్ కనిపించకుండా గోడకు తెలుపు రంగు వేసాడు. ఆమె జ్ఞాపకాలు చెరిపేసే ప్రయత్నం చేసాడు.
ఇది చూసిన నటి తీవ్ర ఆవేదన చెందింది. 'గోడ మీద వేసిన ఆర్ట్ ని చెరిపేస్తున్నావ్ కానీ నిజాన్ని ఎప్పటికీ మాయలేవు. నిజం మీద అబద్దం ఈరోజు గెలవొచ్చు. కానీ అది తాత్కాలికమే. శాశ్వతంగా నిలిచేది నిజం మాత్రమే. అందుకు సమయం పట్టొచ్చు. కానీ వచ్చిన రోజు నువ్వేం తప్పు చేసావో తెలుస్తుంది' అని వాపోయింది. గత ఏడాది మార్చిలో దిల్జీత్-నిఖిల్ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండవ వివాహం. అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు.
నిఖిల్ కి కుమార్తె ఉండగా దిల్జీత్ కి కుమారుడు కలరు. ఇద్దరి రెండవ వివాహం కూడా ఫెయిలవ్వడంతో సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వివాహమైన నాటి నుంచి దిల్జీత్ కౌర్ టీవీ షోలకు దూరమైంది. అప్పటివరకూ వరుస టీవీ షోలతో నార్త్ ఆడియన్స్ లో ఎంతో ఫేమస్ అయిన అమ్మడి కెరీర్ లో వివాహం చాలా మార్పులు తీసుకొచ్చింది. టీవీ ప్రపంచానికే దూరమైంది. వెబ్ సిరీస్ ల్లోనూ..మ్యూజిక్ వీడియోల తోనూ దిల్జీత్ ప్రేక్షకుల్ని అలరించింది. విడాకులైన నేపథ్యంలో మళ్లీ కంబ్యాక్ అయ్యే అవకా శాలున్నాయి.