Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. దిల్ రాజు అలా అనేశారేంటి?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదలకు ముందే కొంత పాజిటివ్ హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 April 2024 4:28 AM GMT
ఫ్యామిలీ స్టార్.. దిల్ రాజు అలా అనేశారేంటి?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదలకు ముందే కొంత పాజిటివ్ హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్, పరశురామ్ కాంబోలో ఇప్పటికే వచ్చిన గీత గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్యామిలీ స్టార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ మూవీ విడుదలయ్యాక కాస్త మిక్స్ డ్ టాక్ దక్కించుకుంది.

అయితే చిత్ర యూనిట్ మాత్రం ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. మూవీ రివ్యూలపై కామెంట్స్ చేశారు. మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ మరోలా ఉందని తెలిపారు. సినిమా విషయంలో టార్గెట్ రీచ్ అయ్యామని చెప్పారు.

కుటుంబ ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీసినట్లు తెలిపారు దిల్ రాజు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌ కు తరలి వెళ్తున్నారని చెప్పారు. తామ ఇచ్చే స్టేట్మెంట్స్ ను మీడియా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో, వాళ్లు రివ్యూస్‌ ద్వారా ఇచ్చే స్టేట్మెంట్స్ ను తాము కూడా యాక్సెప్ట్ చేస్తామని తెలిపారు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షో చూసిన తర్వాత.. కొందరు మీడియా మిత్రులు తనకు ఫోన్ చేసి సినిమా ఎంజాయ్ చేశామని చెప్పారని దిల్ రాజు అన్నారు.

"సాధారణంగా దర్శకుడు రాసుకున్న స్టోరీ బట్టి కాస్టింగ్ ఎంపిక ఉంటుంది. ఈ కోణంలోనే వెన్నెల కిషోర్ ను సెలెక్ట్ చేశాం. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. ఆడియన్స్ తెగ నవ్వుకుంటున్నారు. మ్యారేజ్ సాంగ్ హిట్ అయింది. అయితే కావాలనే ఈ పాటను లాస్ట్ లో పెట్టాం. కానీ కొన్ని చోట్ల పాటను మధ్యలో ఆపేస్తున్నారని విన్నా. ఇప్పుడు అందరికీ చెప్పా. పుల్ సాంగ్ ను ప్రదర్శిస్తారు ఆపరేటర్లు" అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

"అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎక్కడా డామినేట్ చేయలేదు. సెకండాఫ్ అంతా హీరోనే ఎక్కువ కనపడతారు. ఏదైనా సినిమాను సినిమా లాగే తీయాలి. లేకుంటే డాక్యుమెంటరీ తీశారని కామెంట్లు, రివ్యూలు వస్తాయి. ఎప్పుడూ రెండే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఆడియన్స్ కు సినిమా నచ్చిందా? లేదా? అంతే" అని దిల్ రాజు అన్నారు.