రాజకీయాల్లో MPగా అయినా గెలుస్తా.. దిల్‌రాజు కామెంట్
తాజాగా నిర్మాత దిల్ రాజు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే తాను పార్లమెంటు సభ్యుడు కావచ్చని దిల్ రాజు కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీ కాగలనని అన్నారు.
By: Tupaki Desk | 30 July 2023 4:37 AM GMTతెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టిఎఫ్‌సిసి) ఎన్నికల కోలాహాలం నేటి ఉదయం ఫిలింఛాంబర్ లో స్పష్ఠంగా కనిపిస్తోంది. ఉదయం 7 గం.ల నుంచే ఇక్కడ సందడి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో అధ్యక్ష పదవుల కోసం `సి.కల్యాణ్ వర్సెస్ దిల్ రాజు` వార్ జరుగుతోంది. ఆ ఇరువురు ఎవరికి వారు ఛాంబర్ సహా నిర్మాతల సంక్షేమం గురించి తమ ప్రచారంలో ప్రస్థావిస్తున్నారు. సినీపరిశ్రమ అభివృద్ధి కోసం తాము ఏం చేయదలిచారో ఇప్పటికే వెల్లడించారు.
తాజాగా నిర్మాత దిల్ రాజు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే తాను పార్లమెంటు సభ్యుడు కావచ్చని దిల్ రాజు కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీ కాగలనని అన్నారు. రాజకీయాల్లో ఎంపీగా గెలుస్తాను.. కానీ తెలుగు సినీపరిశ్రమ నా మొదటి ప్రాధాన్యత. సీనియర్ నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. సినిమా పరిశ్రమ పట్ల బాధ్యతగా ఈ పదవిని తీసుకుంటున్నాను`` అని అన్నారు.
పదవి చేపడితే ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటానని తనకు పదవి వల్ల కిరీటం లభించదని కూడా దిల్ రాజు వ్యాఖ్యానించారు. తనకు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా.. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి పురోగతి కోసం నేను ముందుకు వచ్చానని అన్నారు. తన ప్యానెల్ బలం గురించి మాట్లాడుతూ అత్యంత పరిశ్రమలో ఫామ్ లో ఉన్న నిర్మాతలందరూ తన ప్యానెల్‌లో ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలుస్తామని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. సి.కల్యాణ్ తో విభేధాలు లేవని తామంతా ఛాంబర్ అభివృద్ధి కోసం ముందుకొచ్చామని ఎన్నికల్లో పోటీపడుతున్నామని వ్యాఖ్యానించారు.
``పరిశ్రమ ఎగ్జిబిటర్లకు ప్రభుత్వాలతో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి బలమైన చాంబర్ బాడీ అవసరం. పక్కా ప్రణాళికతో అన్నిటినీ పరిష్కరించుకుంటాం`` అని దిల్ రాజు అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత సినిమా పరిశ్రమ పనితీరులో వ్యవస్థాగత మార్పులు వస్తున్నాయని రాజు అన్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సినిమా షూటింగ్‌లు జరగాలని అన్నారు. ఏ నటుడికైనా నటికైనా సమస్య ఎదురైతే మా అసోసియేషన్‌తో సమన్వయం అవసరమని కూడా సూచించారు. ఫిలించాంబర్ లో 1560 మంది నిర్మాతలు సభ్యులుగా ఉండగా 200 మంది మాత్రమే క్రియాశీల నిర్మాతలుగా ఉన్నారని దిల్ రాజు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఓటును వినియోగించుకుని అభివృద్ధికి సహకరించాల్సిందిగా దిల్ రాజు ఈ సందర్భంగా కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేసి ఇకపైనా ముందుకు నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. నేటి (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ఫిలించాంబర్ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.