Begin typing your search above and press return to search.

దిల్ రాజుతో 'మైత్రీ' ఢీ అంటే ఢీ!

ఒకరు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో హిట్టు కొట్టాలని వస్తుంటే, మరొకరు మలయాళ డబ్బింగ్ సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 March 2024 6:16 PM
దిల్ రాజుతో మైత్రీ ఢీ అంటే ఢీ!
X

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. బాక్సాఫీసు దగ్గర పోటీ లేకుండా అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని, ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. మంచి సోలో రిలీజ్ డేట్ దొరికిందని అంతా భావిస్తుండగా.. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మలయాళంలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా తెలుగు హక్కుల్ని మైత్రీ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అంటే 'ఫ్యామిలీ స్టార్' వచ్చిన ఒకరోజు తర్వాత, పోటీగా ఈ డబ్బింగ్ మూవీ థియేటర్లలోకి రాబోతోందన్న మాట.

ఇకపోతే దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 'టిల్ల్లు స్క్వేర్' సినిమాకి కూడా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి పోటీ ఎదురు కాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న 'డీజే టిల్లు' సీక్వెల్ సినిమాను మార్చి 29న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానికి ఒక్కరోజు ముందుగా 28వ తేదీన సలార్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్' చిత్రాన్ని మైత్రీ నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఇలా ఈ సమ్మర్ లో దిల్ రాజు, మైత్రీ సినిమాల మధ్య ఆసక్తికరమైన ఫైట్ చూడబోతున్నాం. ఒకరు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో హిట్టు కొట్టాలని వస్తుంటే, మరొకరు మలయాళ డబ్బింగ్ సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. మొత్తం మీద ఎన్నో ఏళ్లుగా పంపిణీ రంగంలో రాణిస్తున్న దిల్ రాజుకు, కాస్త ఆలస్యంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తూ వస్తున్నారని అర్థమవుతోంది.

జనవరిలో సంక్రాంతి పండక్కి 'గుంటూరు కారం' - 'హను-మాన్' సినిమాలతో రెండు డిస్టిబ్యూషన్ కంపెనీలు పోటీ పడ్డాయి. మళ్లీ ఇప్పుడు సమ్మర్ సీజన్ లో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ పోటీ ఎంత రసవత్తరంగా మారబోతోందనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.