Begin typing your search above and press return to search.

దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనట్లు?

అయితే అది ఇంకా పెద్ద స్కేల్ మూవీ కావడంతో గేమ్ చేంజర్ టేకప్ చేశాడు.

By:  Tupaki Desk   |   16 March 2024 5:15 AM GMT
దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనట్లు?
X

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలు, బిగ్ స్కేల్ మూవీస్ చేస్తానని గతంలో ప్రకటించారు. అందులో భాగంగా మొదటి పాన్ ఇండియా మూవీగా గేమ్ చేంజర్ చిత్రాన్ని ఏకంగా 200 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నిజానికి ఇండియన్ 2 ప్రాజెక్ట్ దిల్ రాజు చేయాలని అనుకున్నారు. అయితే అది ఇంకా పెద్ద స్కేల్ మూవీ కావడంతో గేమ్ చేంజర్ టేకప్ చేశాడు.

ఈ మూవీ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకో షెడ్యూల్ అయితే షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. దీని తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో జటాయు మూవీ 100 కోట్ల బడ్జెట్ తో చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ కూడా భారీ బడ్జెట్ తో పీరియాడికల్ ఫిక్షనల్ మూవీగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో రావణం టైటిల్ తో మైథలాజికల్ ఫిక్షనల్ మూవీని కూడా భారీ బడ్జెట్ తో చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూ వచ్చి రెండేళ్లు అయిపోతుంది. ఇప్పటి వరకు ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. విజయ్ దేవరకొండతో ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్ రాజు చేసి ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీపైన పాజిటివ్ బజ్ ఉంది.

అయితే ఇంద్రగంటి వరుస ఫ్లాప్ లతో ఉన్నాడు. విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ అయ్యింది. ఖుషితో కుదుటపడిన ఫ్యామిలీ స్టార్ తో నిలబడే ప్రయత్నంలో ఉన్నాడు. దీంతో ఇంద్రగంటి- విజయ్ కాంబోలో ఇప్పట్లో సినిమా చేసే ఆలోచనలో దిల్ రాజు లేనట్లు టాక్ వినిపిస్తోంది. శైలేష్ కొలను చివరిగా సైంధవ్ తో డిజాస్టర్ అందుకున్నారు. ఆ మూవీ హిట్ అయ్యి ఉంట విశ్వంభర సెట్స్ పైకి వెళ్ళేది. సైంధవ్ డిజాస్టర్ ఇంపాక్ట్ విశ్వంభర మీద పడింది. టైటిల్ ని మెగాస్టార్ కోసం దిల్ రాజు ఇచ్చేశాడు.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ తో రావణం ప్రాజెక్ట్ అయితే పట్టాలు ఎక్కడానికి కనీసం రెండు, మూడేళ్ళు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2తో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ తో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాలి. మరో వైపు ప్రభాస్ కూడా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడానికి మూడేళ్ళు ఈజీగా పడుతుంది. తరువాత ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే దిల్ రాజు ప్లాన్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి ఇప్పట్లో మోక్షం వచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదని చెప్పొచ్చు.