Begin typing your search above and press return to search.

నష్టపోకుండా దిల్ రాజు కొత్త ప్లాన్!

అయితే బడ్జెట్ మొత్తం తిరిగి రాబట్టుకోవడానికి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లో రెంటల్ విధానంలో సినిమాని అందుబాటులోకి తీసుకురాబోతున్నారంట.

By:  Tupaki Desk   |   22 April 2024 3:51 AM GMT
నష్టపోకుండా దిల్ రాజు కొత్త ప్లాన్!
X

టాలీవుడ్ లో బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి దిల్ రాజు. అతని ప్రొడక్షన్ నుంచి మూవీ వస్తుంది అంటే ఆడియన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఎంత పెద్ద ప్రొడక్షన్ అయిన కూడా ఒక్కోసారి కథల ఎంపికలో ఆయన కూడా తప్పులు చేస్తూ ఉంటారు. అద్భుతమైన కథలు అనుకొని చేసిన సినిమాలు డిజాస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇచ్చే కథలు దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తూ ఉంటాయి. అలా వచ్చి డిజాస్టర్ అయిన వాటిలో శ్రీనివాస కళ్యాణం, థాంక్యూ మూవీస్ ఉన్నాయి. ఈ ఏడాది విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ ని కూడా చాలా నమ్మకంతో తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ మెన్ లైఫ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారని భావించారు.

అయితే అనూహ్యంగా ఫ్యామిలీ స్టార్ మూవీ మొదటి రోజు మొదటి ఆట నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. తరువాత అస్సలు పుంజుకోలేదు. కొంతమంది ఆడియన్స్ బాగుందని చెప్పిన కూడా కలెక్షన్స్ మాత్రం పెరగలేదు. ఓవరాల్ గా థియేటర్స్ లో మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. థీయాట్రికల్ బిజినెస్ పరంగా ఫ్యామిలీ స్టార్ తో దిల్ రాజుకి భారీ నష్టాలు వచ్చాయి.

అయితే ఫ్యామిలీ స్టార్ నష్టాలని రికవరీ చేయడానికి దిల్ రాజు ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ ద్వారా కొంత వరకు పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ మొత్తం తిరిగి రాబట్టుకోవడానికి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లో రెంటల్ విధానంలో సినిమాని అందుబాటులోకి తీసుకురాబోతున్నారంట.

హాలీవుడ్ సినిమాలని ఇప్పటికే రెంటల్ పద్ధతిలో డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ ఛానల్ లో రిలీజ్ చేస్తే ఏ స్థాయి వరకు ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఫ్యామిలీ స్టార్ మూవీ కుటుంబ ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారు. థియేటర్స్ లో వచ్చిన నెగిటివ్ మౌత్ టాక్ కారణంగానే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రాలేదని భావిస్తున్నారు.

అందుకే రెంటల్ విధానంలో ఆడియన్స్ చూడటానికి ఇష్టపడతారని అనుకుంటున్నారు. పరశురామ్ దర్శకత్వంలో గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన రెండో మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ కారణంగానే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు అందుకోవడంలో పరశురామ్ విఫలం అయ్యారు.