Begin typing your search above and press return to search.

దిల్ రాజు నుంచి కంట్రోల్ తప్పిన గేమ్ ఛేంజర్?

ఇండైరెక్ట్ గా ఈ సినిమాపై తన పెత్తనం ఏమీ లేదని, అంతా శంకర్ చేతుల్లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 3:05 PM GMT
దిల్ రాజు నుంచి కంట్రోల్ తప్పిన గేమ్ ఛేంజర్?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ ఫిల్మ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయిపోయింది. కానీ అభిమానులు ఆశించిన స్థాయిలో అప్డేట్స్ బయటకు రావడం లేదు.

అయితే దీంతో తెలుగు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇవ్వండంటూ ఎప్పుటికప్పుడూ హడావుడి చేస్తునే ఉన్నారు. ముఖ్యంగా దిల్ రాజును చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు. అయితే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాంఢీవధారి అర్జున ప్రీ రిలీజ్ వేడుకకు దిల్ రాజు చీఫ్ గెస్ట్ గా హాజరైయ్యారు. అక్కడ కూడా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ అంటూ గోల గోల చేశారు.

దీంతో దిల్ ఎట్టకేలకు సినిమా గురించి మాట్లాడారు దిల్ రాజు. ఇండైరెక్ట్ గా ఈ సినిమాపై తన పెత్తనం ఏమీ లేదని, అంతా శంకర్ చేతుల్లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. నాకు తెలుసు, నేను రాగానే మీరు అరిచారంటే గేమ్ ఛేంజర్ గురించి అని అర్థమైపోయింది. మన చేతుల్లో ఏమీ లేదు. డైరెక్టర్ (శంకర్) ఇచ్చినప్పుడు ఏ అప్డేట్స్ అయినా బయటకు వస్తాయి. మనం ఏమీ చేయలేం అంటూ దిల్ రాజు పేర్కొన్నారు.

సాధారణంగా దిల్ రాజు నిర్మాణ సంస్థలో సినిమా అంటే.. అంతా దిల్ రాజే చూసుకుంటారని, సినిమా ఎప్పుడూ రిలీజ్ చేయాలి, ప్రమోషన్ ఎలా చేయాలి.. అందుకు సంబంధించిన స్ట్రాటజీ అంతా ఆయనే చూసుకుంటారని వినిపిస్తుంటుంది.

కానీ తాజాగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే.. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయాలు, ప్రమోషనల్ స్ట్రాటజీ, ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా.. అంతా దర్శకుడు శంకర్ కంట్రోల్ చేతుల్లోనే ఉందని అర్థమైంది.

ఇక ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ఉండదని కూడా క్లారిటీ వచ్చేసింది. భారతీయుడు 2 షూట్-రిలీజ్ అయితే కానీ.. పూర్తి ఫోకస్ గేమ్ ఛేంజర్ మీదకు శంకర్ పెట్టరని తెలిసిపోయింది. చూడాలి మరి ఈ సినిమా మరి ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుందో.. ఇకపోతే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సునీల్, శ్రీకాంత్, ఎస్ జే సూర్య సహా పలువురు స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.