Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు!

ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 4:30 AM GMT
గేమ్ చేంజర్.. గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ తన పోర్షన్ షూటింగ్ ఫినిష్ చేసుకున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే నెక్స్ట్ మూవీ పెద్ది కోసం రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ లో పెద్ది మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తోన్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తోన్న ఫస్ట్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం దిల్ రాజు 200 కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టారు. అయితే ఇటీవల శంకర్ నుంచి వచ్చిన ఇండియన్ 2 మూవీ డిజాస్టర్ అయ్యింది.

దీంతో గేమ్ చేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అయితే ఈ సినిమాపై దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేసాడనే టాక్ వినిపిస్తోంది. సినిమాని కమర్షియల్ గా బిజినెస్ చేసుకోవడం ఎలాగో దిల్ రాజుకి తెలుసు. అందుకే టేబుల్ ప్రాఫిట్ తోనే గేమ్ చేంజర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

ఇండియన్ 2 మూవీ డిజాస్టర్ కావడంతో గేమ్ చేంజర్ చిత్రాన్ని శంకర్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. శంకర్ కసిగా వర్క్ చేస్తే రిజల్ట్ అద్భుతంగా ఉంటుందని అతని గత సినిమాలు ప్రూవ్ చేశాయి. ఒక్క ఇండియన్ 2 విషయంలోనే అతను ఫెయిల్ అయ్యారు. గేమ్ చేంజర్ బడ్జెట్ అయితే ముందు అన్నదానికి మించి దాటలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. వారందరికీ దిల్ రాజు సమాధానం ఇచ్చేశాడు. రాయన్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ ఎప్పుడొస్తుందని ఫ్యాన్స్ అడిగారు. క్రిస్మస్ కి కలుద్దాం అంటూ శంకర్ స్టేజ్ పైనే చెప్పేశాడు. దీనిని బట్టి డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. త్వరలో అఫీషియల్ గా డేట్ ని కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉందని టాక్.