Begin typing your search above and press return to search.

హారర్ సినిమాలో దిల్ రాజు సెంటిమెంట్ క్యారెక్టర్

ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్ తో మూవీ వస్తోంది

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:18 AM GMT
హారర్ సినిమాలో దిల్ రాజు సెంటిమెంట్ క్యారెక్టర్
X

స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను చాలా మంది యాక్టింగ్ చేయమని బలవంతం చేశారు. లుక్ బాగుండటంతో యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని చాలా మంది దిల్ రాజుని అడిగారు. అలాగే దర్శకుడిగా ఎప్పుడు చేస్తారంటూ కూడా జర్నలిస్టులు ప్రశ్నించారు.

అయితే తాను ప్రొడ్యూసర్ గా ఉండటానికే ఇష్టపడతానని దిల్ రాజు చాలా సార్లు స్పష్టం చేశారు. యాక్టర్ గా చేయడానికి కావాల్సినంత స్కోప్ ఉన్న ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో చిన్న క్యామియోల్లో కనిపించారు. అలాగే గతంలో అంజలి గీతాంజలి చిత్రంలో కూడా దిల్ రాజు చిన్న క్యామియోలో కనిపించారు.

ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్ తో మూవీ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. అంజలితో పాటు మొదటి పార్ట్ లో ఉన్న కమెడియన్స్ ఈ చిత్రంలో ఉన్నారు. అయితే ఈ మూవీ కథ వేరు. ఈ సినిమాలో కూడా దిల్ రాజు క్యామియోలో కనిపిస్తున్నారంట. గీతాంజలిలో కనిపించడంతో ఆ మూవీ సక్సెస్ అయ్యింది.

అదే సెంటిమెంట్ కారణంగా చిత్ర యూనిట్ రిక్వస్ట్ చేయడంతో దిల్ రాజు ఒక సీన్ లో నటించారంట. మార్చిలో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ బట్టి చూస్తే సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా కావాల్సినంత ఉందని అర్ధమవుతుంది. మరి మూవీ ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

అలాగే అంజలి చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. అంజలి పెర్ఫార్మెన్స్ కి ఎక్కడా వంక పెట్టాల్సిన పని లేదు. మరి ఆమె ఈ సినిమాలో ఎలా నటిస్తుందో చూడాలి. ఇక మరోవైపు కోన వెంకట్ కి గత కొన్నేళ్ల నుంచి రైటర్ గా సక్సెస్ లేదు. ఈ సినిమాకు రైటర్ మాత్రమే ఆయన సహా నిర్మాత కూడా. కాబట్టి రెండు విధాలుగా సక్సెస్ రావాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.