Begin typing your search above and press return to search.

దిల్ రాజు ట్రాక్.. ఈ ఇంపాక్ట్ డైరెక్టర్ సెట్ చేయాల్సిందే

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గారు ఈమధ్య కాస్త సక్సెస్ ట్రాక్ ను మిస్సవుతున్నట్లు అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   19 July 2024 4:38 AM GMT
దిల్ రాజు ట్రాక్.. ఈ ఇంపాక్ట్ డైరెక్టర్ సెట్ చేయాల్సిందే
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గారు ఈమధ్య కాస్త సక్సెస్ ట్రాక్ ను మిస్సవుతున్నట్లు అనిపిస్తుంది. బౌన్స్ బ్యాక్ అయ్యేలా సాలీడ్ హిట్స్ అయితే ఈమధ్య పడలేదు. గతంలో మాదిరిగా కొత్త దర్శకులతో పెద్దగా ప్రయోగాలు కూడా చేయడం లేదు. నమ్మకం ఉన్న కాంబినేషన్స్ తోనే హై రేంజ్ లో పెట్టుబడులు పెడుతున్నారు.

అయినా పర్ఫెక్ట్ హిట్ పడడం లేదు. ఇక అనుకోకుండా మధ్యలో వచ్చిన బలగం ఊహలకు భిన్నంగా బిగ్ హిట్ అయ్యింది. అది కూడా అసలైన SVC ప్రొడక్షన్ లో కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కింది. ఇక దిల్ రాజు సక్సెస్ ట్రాక్ మిస్సయిన ప్రతీ సారి ఇంపాక్ట్ ప్లేయర్ తరహాలో SVC కి హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఇంపాక్ట్ డైరెక్టర్ పై రాజుగారికి చాలా నమ్మకం.

SVC బ్యానర్ లో ఒక ఫ్లాప్ వచ్చిన ప్రతీ సారి అనిల్ సాలీడ్ లేదా మినిమమ్ హిట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ - అనిల్ కాంబినేషన్ ను తెరపైకి తీసుకు రాబోతున్నారు. సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. మొదట వీరి కలయికలో వచ్చిన సినిమా సుప్రీమ్. దాని కంటే ముందే సునీల్ తో కృష్ణాష్టమి చేసిన ఊహించని డిజాస్టర్ చూసిన దిల్ రాజుకు వెంటనే సుప్రీమ్ తో కమర్షియల్ గా హ్యాపీ అయ్యేలా చేశాడు అనిల్.

ఆ తరువాత రాజు గారు శతమానం భవతి, నేను లోకల్ సినిమాలతో మరిన్ని లాభాలు అందుకున్నాడు. ఇక వీరి కలయికలో రెండో సినిమాగా వచ్చిన రాజా ది గ్రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకుముందు వచ్చిన వెళ్లిపోమాకే సినిమా కాస్త నిరాశపరచగా అనిల్ వెంటనే రవితేజతో చేసిన బ్లైండ్ ప్రయోగం కాసుల వర్షం కురిపించింది.

ఇక 2019లో వచ్చిన F2 మరో జాక్ పాట్ మూవీ. వీటి కంటే ముందు వచ్చిన శ్రీనివాస కల్యాణం, లవర్ దారుణంగా డిజాస్టర్ కాగా హలో గురు ప్రేమ కోసమే కూడా అంతగా ఆడలేదు. ఇక అనిల్ వెంకీ, వరుణ్ తేజ్ తో చేసిన F2 కామేడి అప్పటివరకు వచ్చిన నష్టాలన్నిటిని సెటిల్ చేసింది. ఇక 2022లో వచ్చిన F3 సినిమా టాక్ పరంగా ఎలా ఉన్నా రాజుగారికి బాగానే గిట్టుబాటయ్యింది. దీనికంటే ముందు వచ్చిన రౌడి బాయ్స్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఈమధ్య దిల్ రాజుకి పర్ఫెక్ట్ అనేలా ఒక్క హిట్ పడలేదు. కాబట్టి అనిల్ - వెంకటేష్ తో చేస్తున్న న్యూ మూవీతో సాలీడ్ హిట్ అందుకొని ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. మరి అనిల్ ఈసారి దిల్ రాజు నమ్మకాన్ని ఏ రేంజ్ కు పెంచుతారో చూడాలి.