Begin typing your search above and press return to search.

లవ్ మీ.. దిల్ రాజు అస్సలు తగ్గలే..

ఆశీష్, వైష్ణవి చైతన్య జోడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు

By:  Tupaki Desk   |   22 May 2024 4:40 AM GMT
లవ్ మీ.. దిల్ రాజు అస్సలు తగ్గలే..
X

దిల్ రాజు సెకండ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2లో వస్తోన్న మూవీ లవ్ మీ. ఆశీష్, వైష్ణవి చైతన్య జోడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లవ్ అండ్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హర్రర్ కి లవ్ డోస్ ఇచ్చి ఒక డిఫరెంట్ కథాంశం చూపించబోతున్నారు.

ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య సెకండ్ మూవీగా ఇది వస్తుండటంతో ఆసక్తి నెలకొంది. అలాగే ఆశీష్ కి కూడా ఇది రెండో సినిమానే. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. స్టార్ మేకర్స్ వర్క్ చేయడంతో కచ్చితంగా లవ్ మీ సినిమాలో ఏదో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందనే మాట వినిపిస్తోంది.

ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఓటీటీ ఛానల్స్ నుంచి ఈ సినిమాకి భారీ ఆఫర్స్ వచ్చాయంట. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి రెడీ అయ్యారంట. అయితే దిల్ రాజు మాత్రం థియేటర్స్ రిలీజ్ కి మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. ఇలాంటి కొత్త ఎలిమెంట్ తో హర్రర్ లవ్ స్టోరీని బిగ్ స్క్రీన్ పై చూస్తే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని, ఆడియన్స్ కి కూడా థ్రిల్ ఫీల్ ఇచ్చినట్లు అవుతుందని దిల్ రాజు భావించారంట,

అందుకే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద స్ట్రీమింగ్ కంపెనీలతో పోటీ పడి లవ్ మీ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. మరి సాలిడ్ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తోన్న ఈ మూవీ థియేటర్స్ లో ఏ స్థాయిలో పెర్ఫార్మ్ చేస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

దిల్ రాజు సెకండ్ బ్యానర్ లో మొదటి చిత్రం బలగం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రెండో చిత్రంగా లవ్ మీ మూవీ వస్తోంది. ఈ సినిమా కూడా హిట్ అయితే బ్యానర్ గుడ్ విల్ కూడా పెరుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని దిల్ రాజు దగ్గరుండి చూసుకుంటున్నాడు. తన ఫ్యామిలీ హీరో కావడంతో మరింత ఎక్కువ ఫోకస్ పెట్టారు.