బాలీవుడ్‌పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్
ఇటీవలి ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ సన్నివేశంపై మాట్లాడారు. కోవిడ్-19 సమయంలో నిర్మాతలు ఎలా బాధపడ్డారో దిల్ రాజు వెల్లడించారు.
By: Tupaki Desk | 28 Dec 2023 5:54 AM GMTకోవిడ్ 19 మహమ్మారీ 2020-22 సీజన్ లో ప్రపంచానికి అత్యంత సమస్యాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా పరిశ్రమలు అల్లకల్లోలం అయ్యాయి. అయితే కోవిడ్ సన్నివేశంలోను టాలీవుడ్ కొన్ని బ్లాక్ బస్టర్ విజయాలతో జోష్ లో కనిపించగా, అదే సమయంలో బాలీవుడ్ పూర్తి పరాజయాలతో దిగాలు పడింది. అగ్ర హీరోలు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడడంతో ఏం చేయాలో పాలుపోని సన్నివేశం నెలకొంది. కానీ 2023 హిందీ చిత్రసీమకు అన్నివిధాలా కలిసొచ్చింది.
ఇటీవలి ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ సన్నివేశంపై మాట్లాడారు. కోవిడ్-19 సమయంలో నిర్మాతలు ఎలా బాధపడ్డారో దిల్ రాజు వెల్లడించారు. మహమ్మారి సమయంలో డబ్బు సంపాదించడానికి చాలా మంది చిత్రనిర్మాతలు OTT ప్లాట్‌ఫారమ్‌లను ఇష్టపడ్డారని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకు కూడా పోటెత్తారని దిల్ రాజు ధీమాను కనబరిచారు. రాజు గారు తనదైన శైలిలో వివరణ ఇస్తూ.."రంగస్థలం అనుభవం వేరు" అని అన్నారు. ఇంట్లో సినిమా చూసి అలాంటి అనుభూతిని పొందలేరని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ అని అన్నారు. వారి సినిమాలు ఒక సంవత్సరం క్రితం ఘోరంగా విఫలమయ్యాయి. బాలీవుడ్ అధ్యాయం ముగిసిందని చాలామంది భావించారు. కానీ హిందీ చిత్ర పరిశ్రమ 2023లో బాగా పుంజుకుందని అన్నారు.
ఈ సంవత్సరం ఆటుపోట్ల సన్నివేశం మారింది. ఈ ఏడాది బాలీవుడ్ సినిమాల బాక్సాఫీస్ నంబర్లు అత్యద్భుతంగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ సర్ రెండు పెద్ద బ్లాక్ బస్టర్లను అందించారు. ఇటీవల 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. అందరూ మెచ్చుకునే వసూళ్లు దక్కుతున్నాయి. కాబట్టి చిత్ర నిర్మాతలుగా ప్రేక్షకులు చూడాలనుకునే కంటెంట్‌ని మేము అందించాలి అని సన్నివేశం నేర్పుతోంది.. అని అన్నారు.
దిల్ రాజు జెర్సీ, హిట్ లాంటి చిత్రాలను సహచర నిర్మాతలతో కలిసి బాలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు ఆశించినంత పెద్ద విజయం సాధించక పోయినా రాజు గారి స్టామినాను హిందీ చిత్రసీమకు పరియం చేసాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానుంది. హిందీలోను అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రణాళికల్లో ఉన్నారు. దీంతో ఆయన పేరు అక్కడా మార్మోగుతోంది.