దేవర రిలీజ్.. దిల్ రాజు మాటతో మరో షాక్
దేవర వాయిదా పడితే మాత్రం తప్పకుండా ఫ్యామిలీ స్టార్ అదే డేట్ కు ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉంది అని దిల్ రాజు ఒక వివరణ అయితే ఇచ్చారు.
By: Tupaki Desk | 29 Jan 2024 12:25 PM GMTజూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న దేవర సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా అనే ఊహగానలు ఇటీవల చాలానే వచ్చాయి. సినిమాను తప్పకుండా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తాము అని చిత్ర యూనిట్ అయితే గత ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తోంది గతంలో కూడా సినిమా విడుదలపై చాలా రకాల గాసిప్స్ రాగా నిర్మతలు మాత్రం తప్పకుండా అనుకున్న డేట్ కు వస్తాము అని క్లారిటీగా చెప్పేశారు.
దీంతో ఇప్పుడు కూడా వస్తున్న రూమర్స్ లో నిజం కాకపోవచ్చు అని ఓవర్గం ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో అయితే రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇచ్చిన ఒక ఉదాహరణతో సినిమా ఆ డేట్కు రాకపోవచ్చు అనేలా మరింత ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల నిర్మాతల మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు సినిమాల విడుదల తేదీలపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రానున్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. దేవర వాయిదా పడితే మాత్రం తప్పకుండా ఫ్యామిలీ స్టార్ అదే డేట్ కు ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉంది అని దిల్ రాజు ఒక వివరణ అయితే ఇచ్చారు. దీంతో మరోసారి దేవర రిలీజ్ డేట్ పై చాలా రకాల అనుమానాలు అయితే హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి.
ఇక రూమర్స్ ఈసారి ఎన్ని వచ్చినా కూడా నిర్మాతల నుంచి అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుత వాతావరణం చూస్తుంటే మాత్రం దేవర వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది అని బలమైన టాక్ వచ్చింది.
అలాగే మరొకవైపు సినిమాలో ప్రధాన విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవల షూటింగ్లో గాయపడ్డారు. అతను దాదాపుగా నెల రోజులపాటు రెస్టు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితులు విడుదల డేట్ ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై నిర్మాతలు ఎప్పుడూ అఫీషియల్ గా క్లారిటీ ఇస్తారు చూడాలి. ఇక దేవర సినిమా వాయిదా పడనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ వస్తే మరిన్ని సినిమాలు ఆ డేట్ కి వచ్చే అవకాశం ఉంది.